దారుణం : పెగ్గు పోయ లేదని స్నేహితుని నరికేశాడు..?

praveen
ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది చిన్న చిన్న కారణాలకే దారుణంగా హత్య చేస్తున్న  ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.  చిన్నచిన్న కారణాలకే ఏకంగా క్షణికావేశంలో దారుణంగా సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  క్షణికావేశం ఏకంగా ఒకరి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. అంతే కాకుండా మరొకరు జైలు పాలు కావడానికి కారణమైంది. చిన్న కారణానికి ఉన్మాది లా మారిపోయిన స్నేహితుడు ఏకంగా సాటి స్నేహితుని దారుణంగా అంతమొందించాడు.

 క్షణికావేశంలో స్నేహితుని ప్రాణం తీయడమే కాదు చివరికి జైలుపాలు కావాల్సిన దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మద్యం కోసం ఏకంగా స్నేహితుడిని కిరాతకంగా హత్య చేశారు ఇక్కడ ఒక నీచుడు.  హత్య జరిగిన ఐదు రోజుల అనంతరం  పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇక పోలీసు విచారణ లో నిందితుడు చెప్పిన షాకింగ్ నిజాలు తెలిసి  ఒక్కసారిగా పోలీసులు సైతం షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే... షాంలి  జిల్లాలోని పీరఖేదా  ప్రాంతానికి చెందిన జస్  బీర్ అని 60 ఏళ్ల వ్యక్తి కృష్ణ పాల్ అనే  55 ఏళ్ల వ్యక్తి స్నేహితుడు ఉన్నాడు అయితే ఇటీవలే కృష్ణ పాల్ స్నేహితుని దారుణంగా హత్య చేశారు.

 కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా స్నేహితుడు కృష్ణ పాల్  హత్య చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడు కోసం ఐదు రోజుల పాటు పాలించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. హత్య చేయడానికి గల కారణాన్ని కృష్ణ పాల్ మాటల్లో  విని ఒక్కసారిగా షాకయ్యారు పోలీసులు. తనకు పెగ్గు పోయ  లేదని అందుకే నరికేశా అంటూ  చెప్పడంతో పోలీసులు సైతం షాకయ్యారు. కేవలం పెగ్గు కోసం స్నేహితుడిని హత్య చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: