15 ఏళ్ల నుంచి మూడుపూటలా మిక్చర్ తింటుంది.. ఎందుకో తెలుసా.?

praveen
ప్రతి మనిషి జీవితం లో ఆహారం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే . ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఆహారం తీసు కోవడం ఎంతో మంచిది ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాసలాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూనే ప్రపంచంలో ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారు అయితే మసాలాలు దట్టించిన ఆహారం కాకుండా పౌష్టికాహారం తీసుకోవడం కారణంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు వైద్యులు. అంతేకాకుండా రోజు క్రమం తప్పకుండా తప్పనిసరిగా ఆహారం తీసుకోవాల్సి వస్తుంది.

 క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడంతోపాటు శరీరానికి సరైన శక్తి కూడా సమకూరుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడైనా ఉపవాస దీక్షలు పూనుకున్న  సమయంలో ఏమీ తినకుండా ఉండడం తో సాయంత్రం వరకు అందరూ నీరసంగా  మారిపోతుంటారు అన్న విషయం తెల్సిందే. ఇక ఆ తర్వాత ఆహారం తీసుకున్నాక మళ్లీ నార్మల్ అయిపోతుంటారు. అదే సంవత్సరాల పాటు ఆహారానికి దూరంగా ఉండి కేవలం మిక్చర్ మాత్రమే తింటూ ఉండడం అంటే అది మామూలు విషయం కాదు.

 అయినా అలా ఎవరైనా చేస్తారా అని అంటారా  కానీ.. ఇక్కడ ఒక బాలిక ఇదే చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ బాలిక కొన్నేళ్ల నుండి మిక్చర్ తింటూ  కడుపు నింపుకుంది. పదిహేనేళ్ల నాగేంద్ర చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం మూడు పూటలా మిక్చర్ తినడంతో పాటు చాయ్ తాగి జీవనాన్ని  సాగిస్తోంది. అయితే కుటుంబ సభ్యులు అందరూ అన్నం తింటున్నప్పటికీ నాగేంద్ర మాత్రం ఏడాది వయస్సు నుంచి అన్నం తినడం పై ఆసక్తి చూపలేదు. కుటుంబ సభ్యులు బలవంతంగా అన్నం తినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా చివరికి వాంతులు కావడంతో వారు కూడా నాగేంద్ర కు మిక్చర్ మాత్రమే పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: