రాజ‌కీయంలోనే కాదు రైతు కోసం కొత్త ఒర‌వ‌డే ' ఏలూరి ' స్టైల్‌..!

VUYYURU SUBHASH
ఆయ‌నో ఎమ్మెల్యే. అయితేనేం.. అన్న‌దాత గుండెచ‌ప్పుడు తెలిసిన ప్ర‌జాప్ర‌తినిధి. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఇంటా బ‌య‌టా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న రైత‌న్న‌లను ఆదుకునేందుకు న‌డుం బిగించారు. వారి స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలిసి ఉండ‌డం, స్వ‌త‌హాగా తాను కూడా వ్య‌వ‌సాయం నుంచే రావడంతో నేరుగా ఆయ‌న రైతుల‌కు చేరువ అవుతున్నారు. ఆయ‌నే ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించిన టీడీపీ నాయ‌కుడు, యువ నేత ఏలూరి సాంబ‌శివ‌రావు. ఈ దేశంలో రైతు అంటే.. క‌ష్టాలు, క‌న్నీళ్ల‌కు ప్ర‌తీక‌. తాను తిన్నాడో లేదో తెలియ‌దు కానీ.. ఈ దేశం ఆక‌లి నింపేందుకు మాత్రం ప్ర‌య‌త్నిస్తాడు.
అలాంటి అన్న‌దాత‌కు ప్ర‌భుత్వాలు ఎంత చేసినా త‌క్కువే అంటారు ఏలూరి సాంబ‌శివ‌రావు. స్వ‌యంగా తాను కూడా రైతుల‌ను ఆదుకునేందుకు, వారి క‌ష్టాలు పంచుకునేందుకు ఎక్కువ స‌మ‌య‌మే కేటాయిస్తున్నారు. సాధార‌ణంగా నేత అన‌గానే.. స‌మ‌స్య‌లు వినేందుకే స‌మ‌యం ఉండ‌ద‌ని అంటారు. ఒక‌వేళ విన్నా.. వాటిని ప‌రిష్క‌రించే స‌మ‌యం చాలా త‌క్కువ మంది మాత్ర‌మే చేసే ప్ర‌క్రియ కానీ, దీనికి భిన్నంగా.. తాను కూడా రైతుల్లో రైతులా క‌లిసిపోయి.. వారి స‌మ‌స్య‌లు విని ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నారు ఏలూరి సాంబ‌శివ‌రావు.  పంటలలో వచ్చే చీడ,పీడలు నివారణ, వాతావరణ పరిస్థితులు, రైతాంగ సమస్యలపై అప్రమత్తం చేసేందుకు నూతన ఒరవడికి పూనుకున్నారు.
అతివృష్టి అనావృష్టి కారణంగా చేతికొచ్చిన పంటలు  నీటిపాలు కావడంతో తీవ్రమానసిక ఆందోళనకు గురవుతున్న రైత‌న్న‌కు త‌న మాట‌లు , చేత‌ల ద్వారా ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఈ క్ర‌మంలోనే  రైతు ప్రగతి యాత్రకు శ్రీకారం చుట్టారు.  సాగు మెలకువలు వివరిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. ప‌రుచూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ పంటల సీజ‌న్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గంలో చాలా గ్రామాల్లో రోజూ ప‌ర్య‌టిస్తూ రైతుల‌కు వ్య‌వ‌సాయంలో మెళ‌కువ‌లు, సూచ‌న‌లు చేస్తున్నారు.  

అంతేకాదు, రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ.. వరదలు వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతాంగానికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే అన్నదాతలను ఆదుకునేందుకు తన వంతు కర్తవ్యంగా మిరప రైతు కోసం 40 లక్షలకు పైగా మొక్కలను రైతుల చెంతకు చేర్చారు. మ‌రీ ముఖ్యంగా  అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగానికి ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు రైతులందరిని సంఘటితపరచి పంటలలో మెళకువలు వారి సందేహాలను నివృత్తి చేస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ తన వంతు (ఉద్యానవన శాఖ అధికారి )గా  త‌న‌ అనుభవంతో రైతులకు సలహాలు సూచనలు చేస్తున్నారు. దీంతో ప‌రుచూరు వ్యాప్తంగా రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: