ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపుతున్న ఘటన డ్యాన్సర్ గాయత్రి ఆత్మ హత్య కేసు.. ఈ కేసు పై విచారణ చేపట్టిన పోలీసులు అన్నీ కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణం పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం బయటపడటం తో భర్తకు మొహం చూపించలేక బలవన్మరణానికి పాల్పడ్డట్లు తేల్చారు. కృష్ణా జిల్లా లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గాయత్రి చదివింది పాలిటెక్నిక్ చదివింది. 10ఏళ్ల క్రితం సతీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వృత్తి రిత్యా డ్యాన్సర్ అయిన ఆమె.. పలు పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో డ్యాన్స్ షోల్లో పాల్గొంటూ ఉంటుంది. భర్తతో కూడా ఏలాంటి విభేదాలు లేకపోవడం, అతను ప్రేమగా చూసుకుంటాడు. అతనికి ఈ విషయం ఎక్కడ తెలిసిం దో అని భయం తో ఆమె ఉరివేసుకొని చనిపోయింది.
తాను పనిచేసే డాన్స్ ట్రూప్ లో సునీల్ అనే వ్యక్తితో గాయత్రికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సునీల్ భార్యకు తెలిసింది. సునీల్-గాయత్రి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ మెసేజ్ లు చూసిన నీలిమ.. గాయత్రిని అడిగేందుకు ఇంటికొచ్చింది. ఇదే సమయంలో భర్త సతీష్ ను పిల్లల్ని బయటకు పంపేసింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నీ సంగతి తేలుస్తా అంటూ నీలిమ అక్కడి నుంచి వెళ్లిపోయింది..ఆమె సంబంధం బయట పడంతో భర్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉరి వేసుకొని చనిపోయింది.గాయత్రి ఆత్మహత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటికే నీలిమతో పాటు ఆమె భర్త సునీల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..