భార్య అక్రమ సంబంధం.. భర్త చేసిన పనికి షాక్.. విచారణలో సరికొత్త ట్విస్ట్..?

praveen
ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల నెపంతో జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సాఫీగా సాగిపోతున్న సంసారంలో కి మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో అసలు కథ మొదలై చివరికి కట్టుకున్న వారి ప్రాణాలు తీసేంతవరకు దారితీస్తుంది. కొంతమంది ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వారి ప్రాణాలను తీస్తూ ఉంటే మరి కొంతమంది ఏకంగా అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనే కారణంతో కట్టుకున్నవారిని కిరాతకంగా హతమార్చిన ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  పరాయి వ్యక్తి మోజులో పడిన ఓ మహిళ ప్రియుడితో రాసలీలల్లో మునిగి తేలుతున్న సమయంలో భర్త కంట పడడంతో చివరికి దారుణం జరిగిపోయింది.

 ఈ ఘటన బీహార్లోని దర్భాంగా లో వెలుగులోకి వచ్చింది... దర్భంగా లోని ఓ మహిళకు  బిశ్వాస్ అనే యువకుడితో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలం వరకు వీరి సంసారం సాఫీగా సాగిపోయింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలై తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. బిశ్వాస్ మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకునేవాడు.. భార్య స్థానిక కార్యాలయంలో హెల్పర్ గా పని చేస్తూ ఉండగా అక్కడ పనిచేస్తున్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది  మహిళ. కొద్దిరోజుల పాటు భర్తకు తెలియకుండా వీరి రాసలీలలు కొనసాగుతూ వచ్చాయి.

 ఇక ఈ క్రమంలోనే కుటుంబం గురించి మరిచిపోయిన మహిళా ప్రియుడికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనే కారణంతో బంగారు ఆభరణాలను ఇచ్చేసింది. ఇక ఈ విషయం కాస్త భర్త వరకు వెళ్ళింది. దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. ఓ రోజు బంగారం విషయం పై భార్యను బిశ్వాస్ గట్టిగా నిలదీశాడు. దీంతో భార్య కూడా భర్త పై ఎదురుదాడికి దిగి మాటల యుద్ధం చేసింది. ఇక దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న భర్త దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం  ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: