ఓఎల్ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం.. చూసి షాకైన పోలీసులు..?

praveen
ఈ మధ్య కాలంలో ఏదైనా వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా కూడా కేవలం అర చేతిలో ఉన్న ఫోన్ లో  ఉన్న యాప్స్ ద్వారానే అన్ని రకాల పనులు  జరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ప్రస్తుతం కొత్త వస్తువులు కొనడానికి ఆన్లైన్ లో ఎన్నో  రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయో..  అమ్మడానికి కూడా అనేక రకాల యాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే వివిధ యాప్స్ ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో ముఖ్యమైన ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి ఈ క్రమంలోనే ఎంతో మంది తాము ఉపయోగించి విసిగిపోయిన వస్తువులను అమ్మాలి అనుకుంటే ఎక్కువగా ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక్కడ ఒక కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టారు ఇక ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన ప్రకటన చూసి ఏకంగా పోలీసులు సైతం షాక్  కి గురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వారణాసి లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టినట్లు ప్రకటన ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనిపై ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే వారణాసిలోని గురుధామ్ లో  ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం ఉంది.

 వారణాసి లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయాన్ని అమ్ముతున్నట్లు ఇటీవలే ఓ ఎల్ ఎక్స్ లో ఓ ప్రకటన వచ్చినట్లు పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం తెలిసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఏకంగా 7.5 కోట్లకు అమ్మకానికి ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్ లో పెట్టినట్లు పోలీసులు గుర్తించి వెంటనే ఆ ప్రకటన తొలగించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి బాధ్యులైన నలుగురిని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: