వారెవ్వా.. ఏమి ఆలోచన భయ్యా.. టీ కోసం ఇంత చేయాలా ..!!

Satvika
మనుషుల మేధస్సు సైన్స్ కన్నా స్పీడ్ గా పెరుగుతుంది.. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ జనాలను అబ్బురపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో ఎన్నో కొత్త వస్తువులను కనిపెడుతూ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.. ప్రస్తుతం ఆహారాన్ని సరఫరా చేయాలన్నా లేదా మరే ఇతర పదార్థాలను తీసుకెళ్లాలని ఉన్నా కూడా ప్లాస్టిక్ సంభందిత కవర్స్ లో ఎక్కువగా వాడుతున్నారు. వాటి వల్ల శరీరానికి చాలా నష్టం వస్తుందని చెప్పినా కూడా జనాలు అదే దారిలో నడుస్తున్నారు. అయితే తమిళనాడు మదురై లో ఓ టీ వ్యాపారి విన్నూత్న ఆలోచన చేశారు.. ప్లాస్టిక్ కి వ్యతిరేఖంగా గొప్పగా ఆలోచించారు.

వివరాల్లోకి వెళితే.. ప్లాస్టిక్‌ కప్పులు వినియోగించి పర్యావరణానికి హాని తలపెట్టొద్దనుకున్న ఓ టీ దుకాణం యజమానికి మహత్తరమైన ఆలోచన కు పునాది వేశారు.. ప్లాస్టిక్‌ టీ కప్పుల స్థానంలో బిస్కెట్లతోనే టీ కప్పులను తయారు చేయించి వాటిలోనే వేడివేడి చాయ్‌ని అందిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచనకు రుచి తోడవ్వడంతో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. తమిళనాడులోని మదురైకి చెందిన వివేక్‌ సబాపతి.. ఆర్‌ఎస్‌ పాతీ నీల్‌గిరి పేరుతో టీ స్టాల్‌ను కొనసాగిస్తున్నారు. 1909 నుంచి వాళ్ళు కుటుంబం టీ వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్‌ కప్పులపై నిషేదం విధించిన తర్వాత ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి కలిగే నష్టం గురించి ఆయన తెలుసుకున్నారు..

టీ అమ్మాలి కానీ ఎలా అని దీర్ఘంగా ఆలోచించి బిస్కెట్ కప్పులను వెలుగులోకి తీసుకొచ్చారు. చాయ్‌లో బిస్కెట్లని ముంచుకొని తినడాన్ని వినియోగదారులు ఇష్టపడతారన్నది తెలిసిన విషయమే. దీని ఆధారంగానే వివేక్‌ ఈ కొత్త ఆలోచనలకు తెర తీశారు. టీ తాగిన తర్వాత ఈ బిస్కెట్‌ కప్పును కూడా తినేయొచ్చు. రూ.20కి ఒక టీ కప్పును విక్రయిస్తున్నారు. ఈఏడాది జూలైలో ప్రారంభించిన బిస్కెట్ కప్‌ టీని తాగేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. పర్యావరణహితమైన ఈ టీ స్టాల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు నగరంలోకి వ్యాపారస్తులకు అతను ఒక రోల్ మోడల్ అయ్యాడు. ఎంతైనా ఇలాంటి ఆలోచన చేయడం గ్రేట్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: