బాలికపై టీచర్ అత్యాచారం.. కోర్టు ఊహించని శిక్ష..?

praveen
ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై హత్యాచారం ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలే కనిపిస్తూ ఉండటంతో ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు ఇక పశువుల్లా  మీద పడిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అభం శుభం తెలియని బాలికలు కూడా ఎంతో మంది కామంతో కళ్లు మూసుకుపోయిన క్రూరమృగాలు లాంటి మనుష్యుల చేతిలో బలి అవుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడిన వారికి కూడా సంచలన తీర్పు వెలువరిస్తూ శిక్షలు విధిస్తున్నాయి.

 ఈ మధ్యకాలంలో కోర్టులు  విధిస్తున్న శిక్షలు చూస్తుంటే కామందుల వెన్నులో వణుకు పుట్టేలా ఉంది ఇక ఇటీవలే హైదరాబాద్ లోని పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఏకంగా 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది కోర్టు. అయితే ఇలా 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. 2017 లో లాలాగూడ లో ఉంటున్న టీచర్ ప్రభాకర్.. దగ్గరికి విద్యార్థులు చదువుకోవడానికి వస్తూ ఉండేవారు.

 ఇలా చదువుకోవడానికి వచ్చిన బాలిక పై కన్నేశాడు టీచర్ ప్రభాకర్ ఈ క్రమంలోనే సరైన సమయం కోసం వేచి చూసి ఓ రోజు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఇక జరిగిన దారుణంపై బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు..  కోర్టులో హాజరుపరచగా 2017 నుంచి ఈ ఘటనపైవాదనలు వాదనలు జరుగుతూనే ఉన్నాయి ఇక ఇవాళ నిందితుడికి శిక్ష ఖరారు అయింది.  బాలికకు మాయమాటలు చెప్పిఅత్యాచారం చేసిన నిందితుడు ప్రభాకర్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: