వణుకు పుట్టిస్తున్న ఇజ్రాయిల్ మాస్టర్ ప్లాన్.. తేరుకునేలోపే అంతా ఖతం.?

praveen
ఇరాన్ లో  నవంబర్ 27న అణు  శాస్త్రవేత్త హత్య ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురిచేసింది అన్న విషయం తెలిసిందే.  సాధారణంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య వైరం ఉంది. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ ఇరాన్ లోని అణు  కర్మాగారాలపై  ఎప్పుడు దాడికి పాల్పడి ఉంటుంది అనే విషయం తెలిసిందే... అంతేకాకుండా ఇరాన్ ఏ మాత్రం తోక జోడించిన తీవ్రంగా స్పందిస్తూ దాడి చేస్తూ ఉంటుంది ఇజ్రాయిల్. ఇలా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య వైరం కొనసాగుతోంది ఇలాంటిది ఇరాన్కు చెందిన అణు  శాస్త్రవేత్త హత్య జరగడం అదికూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో ప్రపంచం మొత్తం హత్య గురించి తెలిసి ఆశ్చర్యానికి గురి అయింది.

 ఈ క్రమంలోనే ఇరాన్ మీడియా కూడా దీనికి సంబంధించి ఎన్నో వాదనలు వినిపించింది. ఇజ్రాయిల్ వ్యూహాత్మకంగా ఇరాన్ అణు శాస్త్రవేత్త ను హత్య చేసింది అంటూ ఆరోపించారు అక్కడి కొన్ని మీడియాలు.  ఇరాన్లో జరిగిన హత్య తీరు చూస్తే మాత్రం ప్రపంచం వనికి పోయే విధంగా ఉంది.అత్యంత భద్రత కలిగిన టువంటి అణు  శాస్త్రవేత్త  కాన్వాయ్ వెళ్తున్న సమయంలో... నిర్ణీత ప్రదేశంలో రాగానే కన్వాయ్ స్లో  అవ్వడం..  పక్కనే పార్క్ చేసి ఉన్న వాహనం కాన్వాయ్ వైపు దూసుకు రావడం.. ఇక ఆ కార్ ఫిట్ చేస్తున్నటువంటి మిషన్ గన్  కాల్పులు జరిపింది.

 వెంటనే అప్రమత్తమైన ఆయన గన్ మెన్స్  సిబ్బంది కూడా కాల్పుల ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఎవరిని కాల్చాలో అర్థంకాని పరిస్థితి ఈ క్రమంలోనే  శాస్త్రవేత్తను కవర్ చేస్తూ అడ్డువచ్చిన సిబ్బంది కూడా బుల్లెట్లు తాకి చనిపోయారు. శాస్త్రవేత్త శరీరం మొత్తం బుల్లెట్ల దాడికి చిత్తుచిత్తుగా మారిపోయింది ఇక అంతలోనే ఆ కార్ కాస్త ఒక్కసారిగా పేలిపోయింది దీంతో ఎలాంటి ఆధారం కూడా దొరకలేదు. ఇలా అణు శాస్త్రవేత్త  హత్య ఇజ్రాయిల్ పనే అని ప్రస్తుతం ఇరాన్ వాదిస్తోంది..  ఇజ్రాయిల్ ఇలాంటివి చేయడంలో పేరొందింది అన్న విషయం తెలిసిందే. కాగా  ఈ హత్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ప్రతినిధులను వణికిస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: