జగన్ సర్కార్ మూడేళ్ళు ఉండటం కష్టమే: బిజెపి నేత సంచలన వ్యాఖ్యలు

Gullapally Rajesh
ఏపీలో వైసీపీ సర్కార్ ని బిజెపి నేతలు కాస్త గట్టిగానే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు బిజెపి ఏపీ మీద ఫోకస్ చేసిన నేపధ్యంలో సిఎం జగన్ ని ఎక్కువగా బిజెపి నేతలు టర్గెట్ చేసి విమర్శలు చేయడం గమనార్హం. రాజకీయంగా వైసీపీని బిజెపి ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బిజెపి నేతలు సిఎం జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ ను ఓ డిక్టేటర్, కిమ్ కంటే జగన్ ను చూసి ఎపీ ప్రజలు భయడుతున్నారు అన్నారు.
జగన్ మూప్పైళ్లు కాదు.. మూడేళ్లు అధికారంలో ఉంటే గొప్ప అని  బిజెపి నేత విష్ణు కుమార్ రాజు ఆరోపణలు చేసారు. జమిలీ ఎన్నికలు వస్తే... జగన్ ను ఇంటికి పంపడం ఖాయం అని ఆయన అన్నారు. జగన్ పై అభిమానం ఎమో గానీ, ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. జివియంసి ఎన్నికలు పెట్టే దమ్ము, ధైర్యం జగన్ కు లేదు అన్నారు. వైసీపీ మీద ప్రజలు చాలా నెగిటివ్ గా ఉన్నారు అని, కరోనా సాకుతో ఎన్నికలను వాయిదా వేస్తున్నారు అని ఆయన విమర్శించారు.
జగన్ రాజకీయ లబ్థికోసం పాదయాత్ర చేశారు. ఇప్పుడు పాదయాత్ర వద్దు.... వాహనాల్లో వస్తే... ఇక్కడ రోడ్లు పరిస్థితి తెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రజా సమస్యలపైన వైసీపీ ఎమ్మెల్యేలకు చెప్పిన ప్రయోజనం లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వారికి మీరు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని ప్రజలు అనుకుంటున్నారు అని అన్నారు. పెట్రోల్, డిజీల్, ఎలక్ట్రికల్ చార్జీలు పెంచారు అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పా...మరేమీ చేయట్లేదు అని ఆయన విమర్శించారు. ప్రజలు జగన్ ప్రభుత్వంపై తిరబడాల్సిన సమయం వచ్చింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: