గ్రేటర్ యుద్ధం : వరదలో మునిగినా.. ప్రజలు మళ్లీ అదే తప్పు చేశారు..?

praveen
సాధారణ ఎన్నికలు జరిగాయి అంటే చాలు ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అవి... అసెంబ్లీ ఎన్నికలు అయిన పార్లమెంటు ఎన్నికలు అయిన స్థానిక సంస్థల ఎన్నికలు అయినా కూడా అదే జోరు కొనసాగుతోంది. అటు ఆయా పార్టీల కార్యకర్తలు ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి  ఎన్నికల పోలింగ్ ముగీసి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఎంతో చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నిక లో కూడా ఇదే జరిగింది. అభ్యర్థులు అందరూ తమ దగ్గర ఉన్న అస్త్రాలను సంధిస్తూ  ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

 తమకు ఓటు వేస్తే డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామంటూ హామీలవర్షం కూడా కురిపించారు అంతే కాదు... ఇక అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలు కూడా రంగంలోకి దిగారు. ఇక మొన్నటికి మొన్న హైదరాబాద్ మొత్తం నగరంలో మొత్తం వర్షాల కారణంగా జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయారు. ఎంతోమంది ప్రజలు ఇక ఇళ్లలోకి నీరు చేరి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక వరదల కారణంగా నగరవాసుల కష్టాలు అన్నీఇన్నీ కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొన్ని వారాల పాటు నగర వాసులు అందరూ భారీ వర్షాలతో వచ్చిన వరదలతో జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయారు.

 అయితే హైదరాబాద్ నగరం మొత్తం వరదల్లో మునిగి తేలిన కొన్ని రోజుల్లోనే జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చాయి. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటర్లు అందరూ ఒక తాటిపై నిలబడి మార్పు కోసం ఓటు వేసి... సరైన నాయకున్ని ఎన్నుకుని  తమ సమస్యలన్నీ తీర్చుకుంటారు అని అందరూ అనుకున్నారు. క్రమంలోని జిహెచ్ఎంసి ఎన్నికలను అందరూ ఎంతో బాగా ఉపయోగించుకుంటారు అని భావించారు. కానీ వరదలు వచ్చినప్పటికీ ప్రజల తీరు మాత్రం మారలేదు. ఓటు వేసేందుకు మళ్లీ నిర్లక్ష్యం చూపించారు. చివరికి పోలింగ్ కేంద్రాలు అన్ని వెలవెలబోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: