గ్రేటర్ యుద్దం : ఎన్ని ప్రత్యేకతలో..నేడే పోలింగ్ !!

KISHORE
ఎన్నడూ లేనంతగా ఈసారి గ్రేటర్ ఎన్నికలు ప్రదాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే.ప్రదాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రచారాలను హోరెత్తింఛాయి. దాదాపు అన్నీ పార్టీలు కూడా హోరాహోరీ ప్రచారాలతో.. పరస్పర ఆరోపణలతో.... పోటాపోటీ మేనిఫెస్టోలతో .స్థానిక ఎన్నికలే అయినప్పటికి సార్వత్రిక ఎన్నికలవలె  అగ్రనేతల రంగప్రవేశాలతో రణరంగాన్ని తలపించేలా జరుగుతున్నాయి.. ఈ కరోనా కాలంలో చాలా తక్కువ సమయంతో ఎన్నికలు జరుగుతూ ఉండడం,అదికూడా ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ను వినియోగిస్తుండడం..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఐతే ఈ ఎన్నికల పట్ల భాజపా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. భాజపా అభ్యర్థుల తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్‌ తదితరులు ప్రచారంలో పాల్గొనడం దేశం మొత్తాన్ని ఆకర్షించింది.

తెరాస తరఫున ప్రధానంగా మంత్రి కేటీఆర్ ఒక్కడేఅన్నీ తానై ప్రచారాన్ని నిర్వహించారు.నవంబర్ 28  సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరిగింది.ఎప్పుడు యాక్టివ్ గా ఉండే కాంగ్రెస్ ఈ సారి వెనకబడిందనే చెప్పాలి.మరి తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత ఈ ఎన్నికలను అస్సలు పట్టించుకొన్నట్టే తెలుస్తుంది.మరి ప్రదాన పోరు మాత్రం టి‌ఆర్‌ఎస్ ,బి‌జే‌పి మద్యనే ఉండగా మరి ఓటర్లు బల్దియా పీఠాన్ని ఎవరికి కట్టబెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: