గ్రేటర్ యుద్ధం : ఆ పార్టీకి అమరావతి సెగలు ? నీళ్లు నమిలేస్తున్నారు ?

జిహెచ్ఎంసి ఎన్నికలలో అన్ని పార్టీలు ప్రజల ముందుకు రకరకాల జెండాలు, అజెండాతో ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు మేనిఫెస్టో లను ప్రకటించి ప్రజలను ఓట్లు అడుగుతున్నాయి. అయితే వారికి ఊహించని  పరిస్థితులు ఎదురవుతున్నాయి. సమాధానం చెప్పలేక నీళ్లు నమ్మాల్సిన పరిస్థితి ని తీసుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో అమరావతి అంశం చుట్టూ రాజకీయాలు తిరుగుతూ వుండడంతో కొన్ని పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోని సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో రాజధాని అమరావతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి నాయకులకు అమరావతి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.




 కూకట్ పల్లి,  శేర్లింగంపల్లి ఏ ఎస్ రావు నగర్, సనత్ నగర్ , దిల్ షుక్ నగర్, వనస్థలిపురం ప్రాంతాలలో బిజెపి నేతలు ఎన్నికల ప్రచారం సందర్భంగా అమరావతి వ్యవహారాన్ని నిలదీస్తూ, సమాధానం చెప్పాలని కోరుతూ... అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన ప్రధాని  నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగడం , ఇప్పుడు దానిని మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం... ఇలా ఎన్నో అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారట. 


అమరావతి ని రాజధానిగా కొనసాగిస్తానంటే బిజెపికి మద్దతుగా నిలబడతామని చాలా సందర్భాల్లో చెబుతుండడం ఆ పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. గ్రేటర్ లో ఎన్నికల ప్రచారానికి వస్తున్న బిజెపి నాయకులకు కొంత మంది ఓటర్లు అమరావతి వ్యవహారంపై ప్రశ్నిస్తూ ఉండడం తో ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రచారానికి వచ్చిన నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: