గ్రేటర్ యుద్ధం : ఎక్కడ తగ్గని టీడీపీ అభ్యర్థి.. ప్రచారంలో స్పీడ్..?

praveen
ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యం లో తెలంగాణ రాజకీయాల లో అనూహ్య పరిణామాలు చోటు చేసు కుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న పార్టీలు కూడా ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టిడిపి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఆయా పార్టీలకు గట్టిపోటీ ఇచ్చి గెలుపొందేందుకు సిద్ధం అయింది అన్న విషయం తెలిసిందే. గ్రేటర్ పరిధిలో అన్ని డివిజన్ల లో కూడా పోటీ చేస్తున్న టిడిపి పార్టీకి చెందిన అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ప్రస్తుతం ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయి లో కసరత్తు చేస్తున్నారు.

 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో గతంలో టిడిపి ప్రభుత్వ హయాం లో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని కెసిఆర్ మాయ మాటల తో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు అంటూ ప్రస్తుతం టిడిపి అభ్యర్థులు టిఆర్ఎస్ వైఫల్యాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి తమకు ఓటు వేయాలి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా మల్కాజిగిరి నియోజకవర్గం టిడిపి అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తూ ప్రస్తుతం ప్రచార రంగంలో దూసుకు పోతున్నారు.

 ఈ క్రమంలో నే జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగం గా మల్కాజిగిరి నియోజకవర్గం లోని తొమ్మిదొవ డివిజన్ రామంతపూర్ లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ముమ్మర ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  మాధవి గిరిబాబు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.  ఇందిరా నగర్ ప్రగతి నగర్ కాలనీ లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.  కాగా టిడిపి పార్టీ అభ్యర్థి  మాధవి గిరిబాబు వెంట ఎంతో మంది టిడిపి కార్య కర్తలు ముఖ్య నేతలు కూడా మద్దతు గా ప్రచారం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: