గ్రేటర్ యుద్ధం : నేడు వారి లెక్క తేల్చబోతున్న కేసీఆర్ ?

మామూలుగానే కేసిఆర్ ప్రసంగాలు గమ్మత్తుగా ఉంటాయి. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా, మొహమాటపడకుండా చెప్పేస్తుంటారు. ఇక ఎన్నికల సమయంలో అయితే, ఒకపక్క సెంటిమెంటును రగుల్చుతూనే, మరో పక్క రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, సెంటిమెంటును రాజేస్తూ ఉంటారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల హడావుడి నడుస్తోంది. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో హోరాహోరీగా గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ గెలిచి తీరాలని కసి పట్టుదల అన్ని పార్టీలలోను ఉంది. ఇప్పటికే టిఆర్ఎస్ లోని కీలక నాయకులంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే , తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశంలో కేసీఆర్ రాజకీయం ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.




 కెసిఆర్ సభ సూపర్ సక్సెస్ చేయాలని టిఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా గ్రేటర్ ప్రజల బలం మొత్తం టిఆర్ఎస్ కు ఉంది అనే సంకేతాలను ఇవ్వాలని టిఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహ పడుతున్నాయి.ఇదిలా ఉంటే ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో కేసీఆర్ ఎవరిని టార్గెట్ చేస్తారు ? ఏవైనా కొత్త విషయాలు చెబుతారా ? అనేది ఆసక్తికరంగా మారింది. తప్పకుండా గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తుందని, వివిధ సర్వే రిపోర్టులు తమకు అనుకూలంగా ఉన్నాయని, గత ఆరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ విజయం వైపు నడిపిస్తాయి అని కేసీఆర్ ధీమాతో ఉన్నారు. 



అదే పనిగా తమపై విమర్శలు చేస్తున్న బిజెపి, ఎంఐఎం పార్టీ లకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మత విద్వేషాలను సృష్టించి, అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాల ని బిజెపి చూస్తోంది అనే అంశాన్ని కేసీఆర్ హైలెట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే గ్రేటర్ ప్రజలకు వరాల జల్లులు కూడా ఇక్కడి నుంచి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిన టిఆర్ఎస్ కొన్ని విషయాలను బాగా హైలెట్ చేసేందుకు కెసిఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ, గ్రేటర్ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచిన అంశాలను కేసీఆర్ హైలెట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే పేద, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందించే విషయాన్ని, హైలెట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: