కాల్పుల్లో అమరులైన ఇద్దరు భారత జవాన్లు..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం జిల్లా రాజౌరిలోని సుందర్‌బానీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (నియంత్రణ రేఖ) పై పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. కాల్పుల్లో నాయక్ ప్రేమ్ బహదూర్ ఖాత్రి, రైఫిల్‌మెన్ సుఖ్బీర్ సింగ్ తీవ్ర గాయాలై, చికిత్స పొందుతూ వీరమరణం పొందారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడ్డారు.
పాక్ ఆర్మీ కాల్పులతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు వారికి ధీటైన సమాధానం చెప్పారు. అంతేస్థాయిలో పాక్ ఆర్మీపై ఎదురు కాల్పులు జరిపారు. అయితే దురుదృష్టావశాత్తు ఇద్దరు భారత జవాన్లు వీర మరణం పొందారు. ఈ కాల్పుల్లో చనిపోయిన వారిలో నాయక్ ప్రేమ్ బహదూర్ ఖత్రి, రైఫిల్ మెన్ సుఖ్‌బిర్ సింగ్ ఉన్నట్లు రక్షణ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. దేశం వీరి త్యాగాలను మరువబోదని, వారి త్యాగాలు వృధా కాబోవని పేర్కొన్నారు. వారి తాగ్యం, విధి పట్ల భక్తికి దేశం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. పూంచ్ జిల్లాలోని కిర్ని, కస్బా ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంట పాక్ కాల్పుల్లో సుబేదార్ స్వతంత్ర సింగ్ గురువారం మృతి చెందాడు. మరో పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు.