
గ్రేటర్ యుద్ధం: కిషన్ రెడ్డి - టీఆర్‌ఎస్ బోట్లు కావాలా.. వరద నీరు రాకుండా పునరుద్ధరణ కావాలా...?
ఈ ఆనందం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ ప్రజల సంక్షేమం కోరే బిజెపి కార్యకర్తలను ఎన్నుకోవడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యానాలు చేశారు... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి . హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన యువత, విద్యార్థులు, మహిళలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు.... అందుకు చాలా సంతోషంగా ఉంది, మీ నమ్మకాన్ని తప్పక నిలబెట్టుకుంటాం అన్నారు. బిజెపి అభ్యర్థి మేయర్ అయితే ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తాం. అంతే కాదు వరదలు రాని హైదరాబాద్ ను నిర్మించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతాం. రోడ్డు మరమ్మత్తులు చేయించు బాగు చేస్తాం, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, ఫుట్ పాత్‌ల నిర్మాణం చేపడతాం’
జీహెచ్‌ఎంసీలో నీతివంతమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా నిలబడతారని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి.
బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వచ్చే వర్షాకాల సమయానికి 100 శాతం ఎవరి ఇళ్లలోకి నీళ్లు రాకుండా పునరుద్ధరిస్తాం. అందుకు తగిన చర్యలు తీసుకుంటాం. టీఆర్‌ఎస్ బోట్లు కావాలా.. వరద నీరు రాకుండా పునరుద్ధరణ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పథకం అయినా కేంద్ర ప్రభుత్వ సహకారం, అండ లేకుండా అమలవడం అసాధ్యం. 169 బస్తీ దవాఖానా లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రికి, కేటీఆర్‌కి ఇదే నా సవాల్.. మీకు చిత్త శుద్ధి ఉంటే దీనిపై చర్చకు రావాలి’ అంటూ సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. 2014 లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ...ఎక్కడ చూసినా తండ్రి కొడుకుల బొమ్మలతో నింపేశారు, కానీ ప్రజలకు కూడా ఆలోచన శక్తి ఉంది... ఎవరు తమకు అండగా నిలబడతారో వారికి బాగా తెలుసు అంటూ వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.