గ్రేటర్ యుద్దం: భారతి నగర్ లో ఉద్రిక్తంగా మారిన టీఆరెఎస్ నేతల ర్యాలీ..
కేసీఆర్, కేటీఆర్ లు ప్రచారంలో జోరును పెంచారు. ర్యాలీలు , రోడ్ షో లు నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో జరిగిన దుబ్బాక ఎన్నికల తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం సినీ పరిశ్రమలకు సరి కొత్త వరాలను అందిస్తూ ఆకర్షిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో లో కొన్ని నిర్ణయాలను కూడా పొందుపరిచారు. వాటికి తగ్గట్లుగా అన్నీ చర్యలను చేపడుతూ ముందుకు సాగుతున్నారు. తెరాస నాయకులు బిజేపికి ఎక్కడా ఇసుమంత ఛాన్స్ కూడా ఇవ్వకుండా ప్రజలను ఆకర్షించడానికి ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు సంగారెడ్డి భారతి నగర్ కు చెందిన సింధు ఆదర్శ్ రెడ్డి కి మద్దతు తెలపాలని టీఆరెఎస్ మద్దతు రోడ్ షో ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు..ఎంపి ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.. ప్రజలు అభివృద్ధిని కోరుకోవాలి.టీఆరెఎస్ పార్టీని గెలిపించాలని నగరంలోని తెరాస నేతలు టీఆరెఎస్ జెండాల తో బైక్ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ది వైపు అడుగులు వేద్దాం అని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున తెరాస నేతలు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ర్యాలీ కొద్ది సేపు రసాభాసగా మారింది.. ఈ ఎన్నికల్లో టీఆరెఎస్ గెలుపు ఖాయమని నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు..