గుడ్ న్యూస్ : ఆ వ్యాక్సిన్ పూర్తి సురక్షితం..!

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. వైరస్ వెలుగులోకి వచ్చే నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికికూడా కరోనా వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడంలేదు. రోజురోజుకు పెరిగిపోతున్న తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు తీవ్ర ఆందోళనలో మునిగిపోతున్నారు అయితే వైరస్ను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఇప్పటికే పలు దేశాలు... వ్యాక్సిన్ అభివృద్ధి చేసి శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుగుపు lన్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా హైదరాబాద్కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సంబంధించి క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా విజయవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

 కాగా ప్రస్తుతం శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం 2-దశల క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక రెండు దశలలో కూడా క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలను ఇచ్చాయని భారత్ బయోటెక్ పరిశోధకులు తెలిపారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్  కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాక్జిన్  మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో దుష్ప్రభావాలు వచ్చాయని... కానీ ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు బయటకు చెప్పలేదు అన్న వార్త ప్రచారం జరుగుతోంది.

 కాగా తాజాగా ఇదే విషయంపై భారత్ బయోటెక్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్  వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం అంటూ ఆ సంస్థ ప్రకటించింది. ఆగస్టు నెలలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో దుష్ప్రభావాలు వచ్చాయి అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ తేల్చి చెప్పింది భారత్ బయోటెక్. అయితే ఒక వాలంటీర్ కు ఆరోగ్య సమస్యలు వచ్చాయి అంటూ తెలిపిన భారత్ బయోటెక్ అది వ్యాక్సిన్ వల్ల కాదు అంటూ తెలిపింది. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలను పూర్తిగా సమీక్షించిన తర్వాత నే రెండవ దశ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాము అంటూ భారత్ బయోటెక్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: