కరోనా కారణంగా పరిస్థితులు ఎంత దయనీయంగా మారాయి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ మేరకు మాములుగా ఉన్న వాళ్ళు కూడా ఆర్ధిక పరిస్థితుల వల్ల దొంగలుగా మారారు.. తాళాలు వేసి నగరాల నుంచి ఇంటికి వెళ్ళిన వారి ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఉన్నకాడికి దోచుకుంటున్నారు.. కరోనా ప్రభావం తగ్గడంతో ఇళ్లకు వెళ్ళిన వారంతా జరిగిన దొంగతనాలకు చూసి షాక్ అవ్వడమే కాదు పోలీసులను ఆశ్రయిస్తున్నారు..మొన్నటి వరకు కరోనా తో బిజీగా ఉన్న పోలీసులకు పెద్ద చిక్కు వచ్చి పడింది..
విషయానికి వస్తె.. ఒడిశా లో సినిమా రేంజులో ఓ దొంగతనం జరిగింది.. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది..ఘటన ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.12 కోట్ల విలువైన నగదు, బంగారు నగలు చోరీ చేశారు. ముఖానికి మాస్కులు, హెల్మెట్లు ధరించి వచ్చిన నలుగురు దుండగులు కేవలం పదే పది నిమిషాల్లో పని పూర్తి చేయి పారిపోయారు. ఫైనాన్స్ సంస్థ సిబ్బందిని బెదిరించి బాత్‌రూమ్‌లో వేసి తాళం పెట్టారు. లాకర్లను కొల్ల గొట్టి ఉన్నది మొత్తం సర్దుకున్నారు..
రోజూ లాగే కార్యాలయం చేరుకున్న ఉద్యోగులు యథావిధిగా తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆయుధాలు ధరించిన నలుగురు దుండగులు ఆఫీస్‌లోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్‌ను, ఇతర ఉద్యోగులను బాత్‌రూమ్‌లో బంధించారు. వారి వద్ద నుంచి లాకర్ల తాళాలు లాక్కున్నారు. పది నిమిషాల్లో పని ముగించుకొని పారిపోయారు.. ఆ నగల ధర 12 కోట్లు ఉంటుందని మేనేజర్ చెప్పారు..ఈ ఏడాది ఫిబ్రవరిలో లూథియానా శాఖలోనూ ఇదేవిధంగా చోరీ జరిగింది. నాడు సాయుధులైన దుండగులు రూ.13 కోట్ల విలువైన 30 కిలోల బంగారంతో పాటు 3.5 లక్షల రూపాయల నగదును కాజేసారు.. ప్రస్తుతం ఈ కేసును ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు.