డబ్బులు వసూలు చేసిన కేటీఆర్ పిఏ.. కాని చివరలో ట్విస్ట్..?

praveen
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మాయ మాటలతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వారు రోజురోజుకు ఎక్కువవుతున్న  విషయం తెలిసిందే. ఉద్యోగం చేసుకొని లేదా వ్యాపారం చేసుకుని వచ్చిన డబ్బులతో నిజాయితీగా బతకడం కంటే ప్రజలకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకుని జల్సాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు నేటి రోజుల్లో జనాలు. ఇక రోజురోజుకు ఇలా ప్రజలను బురిడీ కొట్టించే కేటుగాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అధికారుల పేరు చెప్పి భారీగా దోచుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది సోషల్ మీడియాని టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో కొంతమంది ముఖ్య అధికారి ల పేరుతో పోస్టుల పెడుతూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు.

 ఇక మరి కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన బంధువులము  అంటూ చెబుతూ ఎన్నో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది ఏకంగా మంత్రి కేటీఆర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు  ఇక్కడ ఒక వ్యక్తి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పేరు చెప్తే నమ్ముతారు నమ్మరు అనుకున్నాడో ఏమో.. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్న కేటీఆర్ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు దండుకుని జల్సాలకు అలవాటు పడ్డాడు ఇక్కడ ఒక వ్యక్తి.

 ఈ క్రమంలోనే కేటీఆర్ పీఏ అంటూ ఎంతో మంది దగ్గర డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్న ఏపీ మాజీ రంజీ ప్లేయర్ ను అరెస్టు చేశారు పోలీసులు. మంత్రి కేటీఆర్ పీఏ  అంటూ పలువురు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నాగరాజు ను ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు అరెస్టు చేశారు. పేద క్రికెటర్లకు సహాయం చేసేందుకు డబ్బులు కావాలని తాను కేటీఆర్  పీఏ అంటూ ఓ ఫార్మా కంపెనీకి టోకరా వేసేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు. గతంలోనూ పలువురు ప్రజాప్రతినిధులు పేరు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన నాగరాజు పై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు ఇప్పటికే  నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: