వృద్ధురాలిని కూడా వదలని కామాంధుడు..బుద్ది చెప్పిన కుటుంబ సభ్యులు..

Satvika
మగాడికి ఫీలింగ్స్ వస్తే చాలు తన ముందు ఉన్నది ఎవరి అనే సంగతి పూర్తిగా మర్చిపోతారు..ఆడది అయితే చాలు అనుకుని దారుణాలకు పాల్పడుతున్నారు.. వావి వరుసలు కూడా పక్కన పెట్టేసి కామంతో కొట్టుకుంటున్నారు.. ప్రభుత్వాలు కామాంధుల నుంచి మహిళలను రక్షించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించిన కూడా వారి ఆగడాలను కట్టడి చేయలేక పోతున్నారు.. కాగా తమిళనాడులో మాత్రం ఇటువంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి.. మద్యం మత్తులో చాలా మంది ఆడవాళ్ళ పై దారుణాలు చేస్తున్నారు . తాజాగా అలాంటి ఘటనే ఒక్కటే వెలుగులోకి వచ్చింది..



తొంభై ఏళ్ల బామ్మను ఓ కిరాతకుడు ఇంటికి వెళ్ళి అత్యాచారం చేయబోయాడు.. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి ఉడాయించారు.. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా పొలాచ్చికి చెందిన వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమరన్ నగర్‌కి చెందిన మైదీన్ ఇంట్లోకి చొరబడ్డాడు. గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని అత్యాచారం చేసేందుకు యత్నించాడు. పక్క గదిలో కుటుంబంతో సహా నిద్రిస్తున్న ఆమె కుమారుడు తల్లి కేకలు విని వెంటనే రావడంతో మైదీన్ అక్కడి నుంచి పరారయ్యాడు.



తల్లి గదిలోంచి పారిపోతున్న యువకుడు మైదీన్‌ని గుర్తించిన బాధితురాలి కుమారుడు మరుసటి రోజు బంధువులు, స్థానికుల సాయంతో అతన్ని పట్టుకుని పొలాచ్చి వెస్ట్ పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.. వయసు కూడా చూడకుండా అతని చేసిన పాడు పనికి అందరూ అతన్ని వెలి వేశారు. మొఖాన ఉమ్మేసారు.. బాధితురాలు వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. నిందితుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. మైదీన్ కూలీ పనులు చేసుకునేవాడని.. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.. అయినా కూడా అలాంటి పనులకు పాల్పడిన వాడికి తగిన శిక్ష వేయాలని పోలీసులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: