పర్యావరణ హిత పటాసులను గుర్తు పట్టడం ఎలా..?
దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ అమ్మాలని ప్రభుత్వాలు ఆదేశించడంతో .. కొంత మేర సాధారణ క్రాకర్స్ కూడా వీటిలో కలిపి అమ్మేసే ప్రమాదం ఉంది. దీంతో గ్రీన్ క్రాకర్స్ వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నట్లు తమిళనాడు క్రాకర్స్ తయారీదారులసంఘం చెబుతోంది.క్రాకర్ బాక్సులపై వివరాలు ముద్రించడంతో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమ్మకందారులు చెబుతున్నారు. వీటిని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నారు.
హైదరాబాద్ సహా పలునగరాల్లో వ్యాపారులు.. తమవద్ద ఉన్నవన్నీ గ్రీన్ క్రాకర్స్ అని చెబుతున్నారు. తాము సరుకు తెప్పించిన కంపెనీలకు ఫోన్ చేసి కనుక్కున్నామని.. వారు పంపించినవి అన్నీ గ్రీన్ క్రాకర్సే అని నమ్మబలుకుతున్నారు.
సాధారణంగా పండుగకు సంవత్సరం ముందు క్రాకర్స్ తయారీని.. సంస్థలు చేపడుతుంటాయి. కొన్నిసార్లు ఏడాదిన్నర సమయం ముందు తయారైన సరుకును కూడా .. అంటగడతాయి. ఇప్పుడంటే గ్రీన్ క్రాకర్స్ అన్న విషయం వైరల్ అవుతోంది కానీ.. అప్పటికి ఆ చర్చే లేదు. మరి వ్యాపారుల వద్ద ఉన్న టపాసులు.. గ్రీన్ క్రాకర్స్ అని ఎలా చెప్పగలుగుతామన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.