సరిగా నిద్రపోవడం లేదా.. అయితే ఇది మీకోసమే..!

N.ANJI
నేటి సమాజంలో చాల మంది రాత్రి సమయంలో సెల్ ఫోన్స్ చూస్తూ నిద్రపోకుండా గడిపేస్తుంటారు. మరికొంత మంది పని ఒత్తిడి, తీరిక లేని జీవనశైలితో రాత్రి పూట సరైనంతగా నిద్ర పోవడం లేదు. రోజుకి 6 గంటలు కాదు కదా.. సుమారు 3 గంటలు కూడా నిద్రపోవడం లేదు. నిత్యం ఇలానే సరైనంతగా నిద్ర పోకపోతే చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మనం సరైన నిద్ర లేకపోతే మన శరీరం మెదడు సరిగా పనిచేయదని వివరిస్తున్నారు.
ఇక పని ఒత్తిడి, తీరిక లేని జీవనశైలితో అనేక మంది రాత్రి పూట సరైనంతగా నిద్ర పోవడం లేదు. నిత్యం ఇలానే సరైనంతగా నిద్ర పోకపోతే చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర  లేకపోతే మన శరీరం, మెదడు సరిగా పనిచేయదని వివరిస్తున్నారు. తగినంత నిద్ర పోకపోతే రక్తపోటు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తుననారు. సరైన నిద్రలేకపోవడం వల్ల మానసికంగా చిరాకుగా ఉండటం, భయం, ఒత్తిడులకు గురికావడం జరుగుతుంది.
కంటికి తగినంత నిద్ర లేకపోతే మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు. దీంతో అనేక మానసిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సరిగా నిద్రపోకపోతే మన రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. తద్వారా కరోనా లాంటి వ్యాధులు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. మేము నిద్రపోతున్నప్పుడు, మన గుండె, రక్త నాళాలు కొంత మేర విశ్రాంతి పొందుతాయి. మీరు నిద్రపోకపోతే లేదా తక్కువ చేయకపోతే హృదయ సంబంధ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. మీరు సరిగ్గా నిద్రపోకపోతే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి బలహీనపడుతుంది. దీంతో డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు రోజంతా నీరసంగా, నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని చేయలేరు, చురుకుదనం లోపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: