పక్కా ప్లాన్ తో కమలం పార్టీ..!

NAGARJUNA NAKKA
గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ స్పీడ్ పెంచింది. సంస్థాగత బలోపేతం పై దృష్టి పెట్టింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే అంశాన్ని వివరించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

దుబ్బాక గెలుపుతో కమలం పార్టీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటుంది. గ్రేటర్ పరిధిలో చేరికల సందర్భంగా సభలు ఏర్పాటు చేస్తోంది. అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సంస్థాగతంగా బూత్ స్థాయిలో బలోపేతం చేసే పని మొదలయింది. సంఘ పరివార క్షేత్రాలతో సమన్వయ సమావేశాలు కూడా జరుగుతున్నాయి.

ఇక దుబ్బాక లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల పై చర్చ బాగా జరిగిందని కేంద్ర పథకాల ను ప్రజల్లో కి తీసుకెళ్లడం లో సక్సెస్ అయ్యామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ కేంద్ర పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలు అధికార పార్టీ కి సవాల్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పై కేసీఆర్ తో చర్చకు సిద్దమంటున్నారు. తెలంగాణ కి ఏ విదంగా అన్యాయం జరిగిందో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి... కేంద్ర సహకారం లేకుండా ఒక్క రాష్ట్ర పథకం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. గొర్ల, చేపల పథకాలకు కూడా కేంద్ర సహకారం ఉందని, గ్రేటర్ లో బస్తి దవాఖానలు కూడా కేంద్ర ప్రభుత్వావేనని బీజేపీ నేతలు అంటున్నారు.

అటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ  వేగం పెంచింది. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పక్కా ప్లాన్ వేస్తోంది.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: