హెర్బల్ ఆయిల్ కొంటే.. 52 లక్షలు మాయం.. చివరికి..?
ముఖ్యం గా భారీగా డబ్బులు ఉన్నా ఖాతాల నే టార్గెట్గా చేసుకుంటున్న కేటుగాళ్లు ఏదో ఒక విషయం లో ఆకర్షించి చివరికి బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. హెర్బల్ ఆయిల్ పేరుతో జనాల ను ఆకర్షించారు కేటుగాళ్లు. కానీ చివరికి భారీగా డబ్బులు దండుకుని బురిడీ కొట్టించాడు. ఈ ఘటన స్థానికం గా చర్చనీయాంశం గా మారింది హైదరాబాద్ నగరం లో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. ఏకంగా 52 లక్షల కాజేసి కుచ్చు పెట్టారు సైబర్ నేరగాళ్లు.
హెర్బల్ ఆయిల్ పేరుతో హైదరాబాద్ నగరం లోని ఎస్సార్ నగర్ వ్యాపారికి.. సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపించారు. సరుకు అమ్ముతాము అంటూ ఆన్లైన్లో పరిచయమై ఆ తర్వాత ఖాతా ఖాళీ చేశారు. ఏకంగా సరుకు కోసం యాభై రెండు లక్షల రూపాయలు బదిలీ చేశాడు వ్యాపారి ఆ తర్వాత మాత్రం కేటుగాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తో అనుమానం వచ్చి పోలీసుల ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితుల విషయం లో అప్రమత్తం గా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు