కులాంతర వివాహం.. కానీ అంతలో ఊహించని ట్విస్ట్..?

praveen
ప్రేమ అంటే ఒక మధురానుభూతి కానీ నేటి రోజుల్లో ప్రేమ అంటే తీరని విషాదం... తల్లిదండ్రులకు కడుపుకోత.. నేటి రోజుల్లో ప్రేమకు అర్థం ఇలాగే మారిపోయింది. ఓ వైపు టెక్నాలజీ పరుగులు పెడుతుంటే నేటి రోజుల్లో కూడా కులాంతర మతాంతర వివాహాలను నేరంగా భావిస్తున్నా  ఎంత మంది తల్లిదండ్రులు ఏకంగా దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఇక తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు అన్న కారణంతో ఏకంగా పిల్లలని దారుణంగా హత్య చేసిన ఘటనలు రోజురోజుకీ తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇలా ప్రేమ పేరుతో  జరుగుతున్న పరువు హత్యలు రోజురోజుకు ఎక్కువవుతూ  అందర్నీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.



 ఈ మధ్య కాలంలో అయితే ఇలా పరువు హత్యలు కిడ్నాపులు పెరిగి పోయిన విషయం తెలిసిందే. కులాలు మతాలు చూడకుండా యువతీ యువకుల మధ్య పుట్టిన ప్రేమ చివరికి విషాదంగా ముగుస్తోంది. పెద్దలకు చెబితే  ఎక్కడ  విడదీస్తారో అన్న భయంతో పెద్దలకు  చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి ప్రేమ జంటలు పెళ్లి చేసుకుంటున్నారు.  కానీ ఆ తర్వాత ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారిని ఎలాగైనా విడగొట్టాలని చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది ఏకంగా దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.. జగిత్యాల జిల్లాలో నవ వధువు  అపహరణకు గురైంది. తమకు ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంది అనే కారణంతో తల్లిదండ్రులు ఏకంగా వధువును  కిడ్నాప్ చేశారు. పోరండ్ల కు చెందిన రాకేష్ పంబట్ల  కు చెందిన సమత కొన్ని రోజులనుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలకు చెబుతే  తమ పెళ్లికి ఒప్పుకోరు అనే కారణంతో ఇంట్లోంచి పారిపోయి ఈనెల 7వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యులు సహించలేదు. దీంతో రాకేష్ పై దాడి చేసి యువతి కి అపహరించారు యువతి కుటుంబ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: