జీవితాల్లో చీకట్లు నింపిన దీపావళి..!
ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలో చాలా చోట్ల బాణాసంచా కేంద్రాలు మూతపడ్డాయి. దీపావళి పండుగ సమయంలో ప్రతీ ఏటా రెండు రాష్ట్రాల్లో ఏదో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. పేలుడు ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో ఈసారి షాపులను అరకొరగానే ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. పర్మినెంట్ లైసెన్సులు తీసుకోవడానికి బాణాసంచా తయారీ కేంద్రాల యాజమాన్యం ముందుకు రావటంలేదు. దీంతో ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు తెరుచుకోలేదు. కొవిడ్ కారణంగా ఏడు నెలలు నుంచి బాణాసంచా తయారీ కేంద్రాలు మూతపడ్డాయి. స్థానికంగా తయారయ్యే మతాబులు, చిచ్చుబుడ్లు, పెన్సిల్స్, తారాజువ్వలు, నాటుబాంబులు, ఇతర పేలుడు వస్తువులు సైతం ఇతర ప్రాంతాల నుంచే తీసుకొస్తున్నారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది బాణాసంచా తయారీ చేపట్టలేదని నిర్వాహకులు చెబుతున్నారు.
మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీపావళికి ముందు ప్రతీ ఏటా ఎక్కడో ఒక చోట బాణాసంచా పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. ఏటేటా ఒక్కొక్క చోట బాణాసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు సంభవించి ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోతుండేవారు. కొన్ని బాణాసంచా తయారీ కేంద్రాలకు మాత్రమే అనుమతులుండగా కోకొల్లలుగా పుట్టుకొస్తూ ఉండేవి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అందుకు తగిన చర్యలు తీసుకోవటంపై దృష్టిసారించే వారు కాదు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడిగా చర్యలు చేపట్టే వారు. ఫలితంగా బాణాసంచా పేలుళ్ల ప్రమాదాలు అధికం అవుతుండేవి.