జో బైడెన్ లక్కీ తేదీ ఇదే.. అందుకే అదే రోజున గెలిచారు..
జో బైడెన్ నవంబరు 7వ తేదీన రాజకీయ అరంగేట్రం చేశారు. నవంబరు 7వ తేదీన యువ సెనెటర్ గా ఎంపిక కాబడ్డారు. అప్పుడు ఆయనకు కేవలం 29 సంవత్సరాలు మాత్రమేనట. కానీ నవంబరు 7వ తేదీన రాజకీయ రంగప్రవేశం చేయడం మళ్లీ నవంబరు 7వ తేదీనే యువ సెనెటర్ గా చరిత్ర సృష్టించడం అతని జీవితంలో యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు. ఎందుకంటే మళ్లీ నవంబరు 7వ తేదీనే ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కాబడ్డారు.
ఒకటిన్నర రోజులుగా 264 ఓట్లు వద్ద నిలిచిన జో బైడెన్ నవంబర్ 7వ తేదీన 290 కి చేరుకోని ఎక్కువ పాపులర్ ఓట్లు సంపాదించిన అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర లిఖించారు. 48 ఏళ్ళ క్రితం నవంబర్ 7వ తేదీన ఆయన యువ సేనటర్ గా ఎంపిక కాబడ్డారు. అయితే ఆ సెనేటర్ ఫలితాలు కూడా చాలా ఆలస్యంగా విడుదలయ్యాయట. సో, ఆయన జీవితంలో ఆలస్యమైతే గాని చెక్కుచెదరని గొప్ప విషయం దక్కదని తెలుస్తూనే ఉంది.