సీఎం కేసీఆర్ సమీక్ష...కీలక అంశాలపై చర్చ...!

VAMSI
ఈ సంవత్సరం వచ్చిన కరోనా మహమ్మారి వలన ప్రపంచమే కొన్ని సంవత్సరాలు వెనుకబడిపోయింది. లక్షల కేసులు...వేళ మరణాలు...ఎన్నో నష్టాలు...మరెన్నో ఆకలి చావులు...ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇదో పెద్ద మానవవినాశనకారిగా చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే దీనినుండి మెల్ల మెల్లగా బయటపడుతూ...దేశం..రాష్ట్రాలు అభివృద్ధి పథంవైపు దూసుకెళ్లడానికి స్వయం ప్రణాళికలు రచించుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మరి ఈ సమీక్షలో ఏ విషయాలను చర్చించనున్నారో తెలుసుకోవాలనుందా అయితే కింద అందించిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను ఒకసారి చదివేయండి.  
ఈరోజు తెలంగాణ సీఎం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా కరోనా వల్ల రాష్ట్రానికి ఆర్ధికంగా జరిగిన నష్టం గురించి వీరితో చర్చించనున్నారు.  అదేవిధంగా ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విషయంపై మధ్యంతర సమీక్ష జరుపుతారు. ఎలాగు జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించే ఆలోచిస్తూ కాలయాపన చేయకుండా...ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు మరియు సర్దుబాటు అంశాల గురించి ప్రధానంగా సమీక్షలో మాట్లాడుతారు.  ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నట్లు తెలియవచ్చింది. ఈ మీటింగ్ తరువాత సీఎం రేపు మంత్రులు మరియు మిగిలిన అధికారులతో సమావేశమవుతారు.  
కరోనాకు సంబందించిన ప్రధాన సమావేశం తరువాత సీఎం కేసీఆర్ సాయంత్రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడనున్నారు.  ఈ సమావేశంలో  వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు పాల్గొంటారు. ముఖ్యంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో జరిగిన మార్పులను గురించి చర్చించనున్నారు. ప్రస్తుతమున్న ఆర్ధిక అభివృద్ధిని మరింత పెంచడానికి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీనుకుంటారో అని ప్రజలంతా వేచిచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: