దారుణం: గుజరాత్ లో ఆవుపై అఘాయిత్యం చేసిన కామాంధుడు..!

N.ANJI
సమాజంలో మహిళలకే కాదు.. ముగజీవాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మన దేశంలో అవును గోమాతగా పూజిస్తాము. అలాంటి ఆవుపై కామంతో ఒళ్లు మరిచిపోయిన ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. చెట్టుకు కట్టేసి ఉన్న ఆవుపై ఈ చర్యకు ఒడిగట్టాడు దుండగుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. చెట్టుకు కట్టేసి ఉన్న ఆవుపై ఆ కామాంధుడు లైంగికదాడికి పాల్పడుతున్న సమయంలో ఈ ఘటనంతా అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని ద్వారకా పాత మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో కట్టేసి ఉన్న ఆవుపై ఒళ్లు మరిచిపోయిన  భరత్ అశ్వర్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఆవు అటూ ఇటూ కదులుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిచింది. కానీ ఆ కామాంధుడికి కనికరం కలగలేదు. ఇది అక్కడే ఉన్న అతుల్ దేవ్ అనే సామాజిక కార్యకర్త చూసి అటువైపుగా పరిగెత్తుతూ రావడంతో.. అశ్వర్ అక్కడ్నుంచి పారిపోయాడు. సీసీ టీవీలో రికార్డైన ఈ వీడియో ద్వారా పోలీసులు అశ్వర్ ను గుర్తించారు. అతడు ఒక రిక్షా డ్రైవర్ అని తేల్చారు. అతడు తనకు బాగా తెలుసునని అతుల్ దేవ్ తెలిపాడు.

ఇక నిందితుడి మీద భారతీయ శిక్షా స్మృతి లోని 377 సెక్షన్ ప్రకారం.. జంతువులపై క్రూరత్వంతో వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి కటకటాల  వెనక్కి నెట్టారు.  దీనిపై గోమాత సంఘాల అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక దేశంలో ఆవులకు రక్షణ  కరువైందని.. తల్లుల్లా చూసుకోవాల్సిన ఆవులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  వారు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: