నాగిని డాన్స్ లేటెస్ట్ వర్షన్.. 2.0.. వైరల్ వీడియో..?

praveen
సాధారణంగా అయితే మనం టీవీ ప్రోగ్రాంలో ఎంతో విభిన్నమైన డాన్స్ చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. కొన్ని సార్లు టీవీ ప్రోగ్రాం లో చూసి డాన్స్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇంత అద్భుతంగా ఎలా చేయగలుగుతారు అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాము.  అయితే టీవీ డాన్స్ ప్రోగ్రాం లో వచ్చే డాన్స్ గురించి ఏమో కానీ.. పెళ్లి ఊరేగింపు లో చేసే డాన్స్ అంతకు మించి అనే విధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. సాధారణంగా పెళ్లిళ్లు లేదా ఏదైనా ఊరేగింపులు జరిగినప్పుడు ఎంతో మంది భారాత్ నిర్వహిస్తూ వివిధ రకాల డాన్సులు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఏ శుభకార్యాలు జరిగిన ఊరేగింపులో ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక అటు చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఇలాంటి డాన్స్ లు తెగ ఆకర్షిస్తూ ఉంటాయి. కొంత మంది రెండు మూడు పెగ్గులు వేసి ఇక మద్యం మత్తులో డాన్స్ చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం సాధారణంగానే డాన్స్ చేస్తూ ఉంటారు ఊరేగింపులలో. ఇక  ఊరేగింపులు అనగానే అందరికీ గుర్తొచ్చేది నాగిని డాన్స్. ఇప్పటినుంచి కాదు మన పెద్దల కాలం నుంచే  ఊరేగింపులో నాగిని డాన్స్ కర్ర సాము లాంటి డాన్స్ లు తెగ ఫేమస్. నాగిని డాన్స్ అయితే ఇప్పటికి కూడా క్రేజ్ తగ్గలేదు.

 ఎక్కడ పెళ్ళి ఊరేగింపు  జరిగిన నాగిని డాన్స్ చేస్తూ కనబడుతూనే ఉంటారు. ఇక్కడ ఓ పెళ్లి ఊరేగింపులో నాగిని డాన్స్ చేశాడు ఓ వ్యక్తి. ఇది సాదాసీదా నాగిని డాన్స్ కాదండోయ్ ఏకంగా నాగిని డాన్స్ 2.0.. సరికొత్త వర్షన్.. అంతకు మించి అనే లాగానే నాగిని డాన్స్ చేశాడు ఇక్కడ ఒక వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అందరూ  ఫిదా అయిపోతున్నారు. ఒక వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా భూమిపై పాముల పాకటమే కాదు ఏకంగా  ఒక పోల్  పట్టుకుని పాముల పాకి  టెన్ట్  ఫైకి ఎక్కి టెంట్  పైన కూడా పాములా పాక్కుంటూ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: