ప్రేమించుకున్న ఇద్దరు యువతులు.. ఇంట్లో నుంచి పారిపోయి..?

praveen
ఈ మధ్యకాలంలో తెలిసీ తెలియని వయసులో చిగురిస్తున్న ప్రేమ ఎన్నో దారుణాలకు దారితీస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువతీ యువకులు తెలిసి తెలియని వయసులోనే ప్రేమ అనే పేరుతో చదువును గాలికొదిలేసి చెట్టా పట్టా లేసుకొని తిరుగుతున్నారు. ఇక అదే సమయంలో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో నుంచి పారిపోయి మరి పెళ్లి చేసుకున్న ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఒక యువతీ యువకుడు ప్రేమించుకున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. సాధారణంగా అది సృష్టి ధర్మం కూడా.

 కానీ ఇక్కడ ఒక విచిత్రమైన ప్రేమకథ వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ యువతి యువకుడు కాదు ఏకంగా ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఇక తమ ప్రేమ విషయం ఇంట్లో చెబితే తల్లిదండ్రులు ఎక్కడ మందలిస్తారో  అని భయపడిపోయారు. ఇక సమాజం తమను ఎక్కడ చిన్నచూపు చూస్తుందోనని  భావించారు. అలాగని ఒకరిని విడిచి ఒకరు ఉండడానికి మాత్రం అంగీకరించలేక పోయారు. చివరికి ఎవరికీ చెప్పకుండా ఏకంగా ఇద్దరు యువతులు ప్రేమించుకొని ఇంట్లో నుంచి పారిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 కర్నూలు పట్టణంలోని సంతోష్ నగర్ కు చెందిన 21 ఏళ్ల యువతి నరసింహా రెడ్డి నగర్ కు చెందిన మరో 20 ఏళ్ల యువతి చిన్నప్పటినుంచి స్నేహితులు. ఇక  తర్వాత వారి మధ్య స్నేహం ముదిరి  ప్రేమగా మారింది. చివరికి తమ  ప్రేమ విషయం తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఇద్దరు యువతుల గురించి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: