జాగ్రత్త పడకపోతే యూరప్ దేశాలు అంతే..!
రెస్టారెంట్లు, అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయనున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే, తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాలి. వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు అదనపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ లాక్డౌన్ విధించిన రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని దేశాధినేతలు తెలిపారు.
ఫ్రాన్స్‌లో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో లక్షలాది మంది జనం సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో పారిస్ చుట్టూ 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఫస్ట్ లాక్డౌన్లో కోవిడ్ యూరప్‌పై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. సెకండ్ వేవ్‌లోనూ కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కరోనాను లైట్ తీసుకోని యూరప్ దేశాలు ఫలితం అనుభవిస్తున్నాయ్.