మొబైల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న టారిఫ్ ఛార్జీలు..?
ఇక ఇప్పటికే భారీగా పెరిగిన టారిఫ్ రేట్లతో వినియోగదారులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా టారిఫ్ రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మొబైల్ వినియోగదారులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని టెలికాం రంగ ఆపరేటర్లు అందరూ రేట్లను భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వోడాఫోన్ ఐడియా తమ టారిఫ్ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకొని వినియోగదారులందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
త్వరలో వొడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లు పెంచనున్నట్లు సంస్థ సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. ప్రస్తుతం టారిఫ్ చార్జీలు పెంచుతున్నందుకు ఎలాంటి నిస్సిగ్గుగా లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక రానున్న రోజుల్లో మిగితా టెలికాం రంగ సంస్థలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రస్తుతం ఉన్న టారిఫ్ ఛార్జీలతో టెలికాం రంగ సంస్థలు కొనసాగడం ఎంతో కష్టతరంగా మారింది అని ఎయిర్టెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొబైల్ వినియోగదారులందరికీ భారీ షాక్ తగల పోతుంది అన్నది అర్ధమవుతుంది. ఇప్పటికే భారీ రేంజ్ లో టారిఫ్ చార్జీలు పెరిగాయి ఇక రానున్న రోజుల్లో ఇంకా ఏ రేంజ్లో పెరుగుతాయో అని అటు మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.