చిడతలు వాయించుకుంటున్న టీడీపీ.. చంద్రబాబు రేటింగ్ పెరిగిందట..?

P.Nishanth Kumar
జగన్ సీఎం అయిన దగ్గరినుంచి చంద్రబాబు వైఖరి ప్రజలకు ఏమాత్రం రుచించట్లేదు.. జగన్ తో కలిసి ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముందుకు రాలేదు కదా కనీసం మద్దతు కూడా తెలపలేదు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతలు సైతం తనను పొగడాలి అనుకునే చంద్రబాబు ఇప్పుడు దాన్ని మరిచి జగన్ ని విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు..పోయిన ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత జగన్ స్పోర్టివ్ గా తీసుకుని కొన్ని విషయాల్లో చంద్రబాబు కు సహకరించారు.. కానీ చంద్రబాబు ఇన్ని ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కూడా తన కన్నా చిన్నవాడైన జగన్ ని ఒరవకుండా ఉండడం ఎవరికీ నచ్చడం లేదు.. ఇక పార్టీ ని గాడిలో పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన చంద్రబాబు చంద్రబాబు ది ఇప్పుడు ఒకటే లక్ష్యం ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందొ అక్కడ పార్టీ ని సరైన దారిలో నడిచేలా చేయడం.. అందుకోసమే దాదాపు సంవత్సరంనర తర్వాత అయన పార్టీ బలోపేతానికి పూనుకున్నాడు..

ఓడిపోయిన తర్వాత చంద్రబాబు దాదాపు ఇంటికే పరిమితమయ్యాడని చెప్పొచ్చు.. తండ్రి కొడుకులు పార్టీ ని గాలికొదిలేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు.. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఎందుకు మెలకువ వచ్చిందో తెలీదు కానీ పార్టీ కోసం చాలా కష్టపడిపోతున్నారు.. ఆ క్రమంలోనే ఇటీవలే పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను నియమించారు.. ఒక్కో పార్లమెంట్ కి ఒక్కో అభ్యర్థి ని నియమించి పార్టీ బలపడేలా చేయాలనీ, పోయిన నమ్మకాన్ని తెచ్చుకునేలా చేయాలనీ చంద్రబాబు సూచించారు..అంతేకాదు వైసీపీ తగ్గిపోయింది టీడీపీ రేంజ్ పెరిగిపోయిందని కొత్తరకం ప్రచారానికి పూనుకుంటున్నారు..

గ‌డిచిన నాలుగు నెల‌ల కాలంలో టీడీపీ దూకుడు నిజంగానే పెరిగింది. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు ప్రజ‌ల్లోకి రాక‌పోయినా.. అమ‌రావ‌తి విష‌యాన్ని ఆయ‌న ‌రాష్ట్ర , దేశ‌, అంత‌ర్జాతీయ స్థాయికి చేర్చారు. ఇక్కడ ఉద్యమం అనే దీపాన్ని ఆరిపోకుండా కాపు కాస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్రభుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. నిత్యం త‌న పార్టీ శ్రేణుల‌ను ఉత్తేజ ప‌రుస్తున్నారు. ఇక‌, ఇటీవ‌ల పార్టీలోనూ సంస్కర‌ణ‌లు తీసుకువ‌చ్చారు.  అంతేకాదు.. నేను మ‌ళ్లీ పుంజుకుంటాను.. అనే సంకేతాల‌ను ఇస్తున్నారు. ప్రభుత్వంపై దాడిలో జ‌న‌సేన‌, బీజేపీల‌ను త‌ల‌ద‌న్నేలా వ్యవ‌హ‌రిస్తున్నారు. మరి నమ్మకం కోల్పోయిన చంద్రబాబు ను ప్రజలు ఏవిధంగా మళ్ళీ నమ్ముతారో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: