29 లక్షల జీతం.. డాగ్ వాకర్లు కావాలంటూ ప్రకటన..?
కొన్ని కొన్ని కంపెనీలు ఆఫర్ చేసే ఉద్యోగాలు ఎక్కువగా నిరుద్యోగులను ఆకర్షిస్తూ ఉంటాయి. మామూలుగా అందరూ కోరుకునేది తక్కువ పని చేసి ఎక్కువ రోజులు సెలవు తీసుకొని అంతకంటే ఎక్కువగా జీతం పొందాలని అనుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ వినడానికి బాగానే ఉంటాయి కానీ నిజ జీవితంలో మాత్రం కాస్త వర్కౌట్ అవ్వవు. కానీ నిజ జీవితంలో మాత్రం ఇలాంటి కొన్ని ఉద్యోగాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి ఇక్కడ ఇలాంటి ఒక ఉద్యోగానికి బంపర్ ఆఫర్ ప్రస్తుతం సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగంలో ఏకంగా సంవత్సరానికి 29 లక్షల వరకు పొందేందుకు అవకాశం ఉంటుంది.
జీతం అంతలా చెల్లిస్తున్నారు అంటే పని కూడా అంత ఎక్కువగా ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఏం చేయాల్సిన పనిలేదు కుక్కలను ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లపై తిప్పేందుకు వాకింగ్ కీ తీసుకెళ్తే చాలు. తమకు డాగ్ వాకర్ కావాలని అందుకుగాను సంవత్సర వేతనం కింద 29 లక్షలు చెల్లిస్తా ము అంటూ ఇటీవల ఓ సంస్థ ప్రకటించింది. లండన్‌కు చెందిన జోసెఫ్ హెజ్ ఆరోన్ సన్ అనే న్యాయవాది సంస్థ తమ సంస్థలో పనిచేసేందుకు ఉద్యోగి గురించి ఈ ప్రకటన విడుదల చేసింది. కేవలం జీతంతో పాటు పెన్షన్ జీవిత బీమా ఆరోగ్య బీమా కూడా ఇస్తాము అంటూ సదరు సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఉద్యోగానికి ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు.