బాలయ్యకు జగన్ బిగ్ షాక్...? ఎక్కడా తగ్గడం లేదుగా..?

Chakravarthi Kalyan
నందమూరి బాలకృష్ణకు ఏపీ సీఎం జగన్ బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. బాలయ్య చిన్న అల్లుడు, విశాఖలోని గీతమ్ విశ్వవిద్యాలయం అధిపతి అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ యూనివర్శిటీ ప్రభుత్వ భూములు ఆక్రమించిందని ప్రభుత్వం చెబుతోంది. అంతే కాదు.. ఏకంగా అక్రమ భూముల్లో ఉన్న కట్టడాలు కూల్చివేయడం ప్రారంభించింది. విశాఖ గీతం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ గదులను ఇప్పటికే మున్సిపల్‌ సిబ్బంది కూల్చివేశారు.
జీవీఎంసీ అధికారులు జేసీబీ, బుల్‌డోజర్లతో ఈ  కూల్చివేతలు చేపట్టారు. బాలయ్య చిన్నల్లుడు విశాఖ టీడీపీలో కీలక పాత్ర పోషిస్తుండటంతో.. టీడీపీ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకోవచ్చన్న అంచనాతో పోలీసులను భారీగా మోహరించి ఈ కూల్చివేతలు ప్రారంభించారు. అసలు కూల్చివేతలు ఎందుకంటే.. గీతం వర్సిటీకి చెందిన 40 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందట. ఈ విషయాన్ని ఆర్డీవో పెంచల కిశోర్‌ ధ్రువీకరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి వర్సిటీ యాజమాన్యం సంప్రదింపులు జరిపిందంటున్నారు.
అక్రమ కట్టడాలు కూల్చివేయడం ప్రభుత్వ విధానం అని ఆర్డీవో చెబుతున్నారు. అక్రమణలో ఉన్న భవనాలను కూల్చివేస్తున్నామని.. ఇప్పటికి ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం కూల్చివేశామని ఆయన తెలిపారు. ఆక్రమణలో ఉన్న భూమిలో మరికొన్ని కట్టడాలను గుర్తించామని తదుపరి దశలో వాటిని కూడా కూల్చివేసే ప్రక్రియ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఆక్రమణలకు సంబంధించి సర్వే ప్రక్రియ గత 5 నెలలుగా చేపడుతున్నామన్న కిశోర్.. ఈ కూల్చివేతపై యాజమాన్యానికి పూర్తి అవగాహన, సమాచారం ఉందన్నారు.
అయితే గీతం ప్రతినిధులు మాత్రం నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు కూల్చుతున్నారో కూడా చెప్పడం లేదంటున్నారు. ఈ తెల్లవారుజామునే తమకు సమాచారం వచ్చిందని.. తామువర్సిటీకి వచ్చేలోపే ఎవరినీ లోపలికి అనుమతించలేదని చెప్పారు. న్యాయపరమైన అంశాలన్నీ కోర్టు పరిధిలో ఉన్నప్పడుు గుట్టుచప్పుడు కాకుండా వచ్చి కూల్చడం అన్యాయం అంటున్నారు. మొత్తానికి జగన్ దూకుడు చూస్తే.. ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: