మన పూర్వికులు రాగి పాత్రలో వండడం, తినడం చేసేవాళ్ళు. అనారోగ్య సమస్యలని దరిచేరనివ్వదు కూడా. రాగి పాత పధ్ధతి అనుకుంటాం కానీ దాని వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా...? రాగి వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూసేయండి. రాగికి సహజ సిద్దంగానే నీటిని శుద్ధి చేసి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను తరిమి కొట్టడం లో చాలా సహాయం చేస్తుంది. దాని వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అలానే బ్యాక్టీరియా, వైరస్ల నుండి కూడా మనం సురక్షితంగా ఉండగలం. పొట్ట లోపల ఇన్ప్లమేషన్ను రెడ్యూస్ చేసి హానికరమైన బ్యాక్టిరియాను చంపడం తో పాటు శుభ్రం చేసి.. లివర్, కిడ్నీ పని సామర్ధ్యంపై ప్రభావం పడకుండా చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు దరిచేరవు.
కరోనాను సైతం తరిమికొట్టవచ్చునని పలువురు పరిశోధకులు సైతం స్పష్టం చేశారు. రాగి పాత్ర లో ఉంచిన నీరు తాగటం వల్ల జీవ క్రియలు సంక్రమంగా జరుగుతాయి. అంతే కాదండి బరువును త్వరగా తగ్గించడంలోనూ రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు దోహద పడుతుంది. వీటిల్లో నిల్వ చేసిన నీరు తాగడంతో శరీరానికి తగినంతగా ఉంచి అనవసర కొవ్వును శరీరంలో ఉండకుండా కాపాడుతుంది. అలానే రాగి లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన రాగి త్వరగా గాయాలను మాన్పుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే రాగి పాత్రలో నీటిని త్రాగండి. ముఖం మీద ఫైన్ లైన్స్ కూడా రావు ఈ నీటిని తాగితే. అలాగే, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా రాగి తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను సరైన విధంగా ఉంచుతుంది. చూసారా రాగి వల్ల ఎన్ని ప్రయోజనలో మరి మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. అనేక సమస్యల నుండి బయట పడండి.