ప్రేమ పేరుతో మోసం... అందమైన యువకుడి ఫోటో పెట్టి...?
ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఊరు పేరు ఫోటో మార్చు కొని ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి ఏకంగా మాయమాటలు చెప్పి పది లక్షల వరకు కాచేసిన కేటుగాన్ని ఇటీవలే పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనుకకు తోసారు. మొగరాల పంచాయితీ గొల్లపల్లికి చెందిన రేపల్లె గుణశేఖర్ ఓ యువతిని మోసం చేశాడు. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసే సమయంలో యువతి ఫోన్ నెంబర్ సంపాదించండి కేటుగాడు... తన పేరు ఊరు పూర్తిగా మార్చుకుని యువతితో పరిచయం పెంచుకున్నాడు. బీటెక్ పూర్తి చేసి గూగుల్లో ఉద్యోగం చేస్తున్నానని యువతిని నమ్మబలికారు.
అంతే కాదు ఫేస్ బుక్ లో ఓ అందమైన యువకుడి ఫోటో పెట్టి ఆ యువతిని ఆకర్షించాడు. ఇక నేరుగా కలవకుండానే ఏదేదో సాకులు చెబుతూ యువతీ నుంచి ఏకంగా వివిధ దఫాలుగా పది లక్షలకు పైగా వసూలు చేశాడు కేటుగాడు. ఇదే తంతు కొనసాగుతున్న తరుణంలో కొన్నాళ్లకు యువతికి అసలు విషయం అర్థమైంది. ఈ క్రమంలోనే తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా సదరు యువతి తో పాటు మరికొంత మందిని కూడా ఇలాగే మోసం చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా నాటు తుపాకులు కూడా సదరు యువకుడు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.