ప్రజలను కాల్చి చంపేయండి.. పాక్ కీలక ఆదేశాలు..?

praveen
పాకిస్తాన్ పూర్తిగా చైనా చెప్పు చేతల్లో బానిస గా మారిపోయిన విషయం తెలిసిందే. ఒక స్వతంత్ర దేశంగా ఉంటున్నప్పటికీ తమ సార్వభౌమాధికార హక్కును చైనా దగ్గర తాకట్టు పెట్టి తమ దేశ ప్రజల ప్రయోజనాలను కూడా గాలికి వదిలేసి కేవలం స్వార్ధ ప్రయోజనాల కోసం చైనాకు బానిసత్వం చేస్తూ చైనా చెప్పిన విధంగా తల ఊపుతూ దారుణంగా వ్యవహరిస్తుంది పాకిస్తాన్. చైనా  సైనికులు పాకిస్థాన్కు చెందిన ఆడ పిల్లలను అపహరించి అత్యాచారం చేస్తున్నప్పటి కీ చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుంది.


 ఇక చైనా లో భాగమైన బెలూచిస్తాన్ ప్రాంతంలో ఎదురుతిరిగిన ప్రజలందరిని చైనా సైనికులు అదృశ్యం చేస్తున్నప్పటికీ కూడా అదేమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్. కానీ  చైనాకు ఏ చిన్న ఎదురుదెబ్బ తగిలిన ఏదో తమకు తగినట్లుగా రియాక్ట్ అవుతూ ఎంతో ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ చైనా కు పూర్తిగా బానిస దేశం గా మారిపోయింది అని ప్రపంచ దేశాలు కూడా అర్థం చేసు కుంటున్నాయి. ఇక ఇటీవల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయం జారీ చేసిన ఆదేశాలు మరింత సంచలనంగా మారిపోయింది.


 చైనాకు బానిసత్వం చేస్తూ పాకిస్తాన్ విచిత్ర వికృతచేష్టలు ప్రస్తుతం తారా స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే  సైన్యం పై పాకిస్తాన్ ప్రజలు ఎవరైనా తిరగబడి రాళ్ళు రువ్విన కూడా అక్కడికక్కడ కాల్చివేయాలి అంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో బెలూచిస్థాన్ పాకిస్థాన్ సింధు ప్రాంతాలలో ప్రజల్లో తిరుగుబాటు మొదలై ప్రస్తుతం ప్రజలందరూ ఉద్యమాల బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే తిరగబడి సైన్యంపై రాళ్లువిసిరిన ప్రజలను ఎక్కడికక్కడ కాల్చి చంపాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్. ఇక దీని వెనక అటు చైనా హస్తం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: