యూపీలో వినూత్న అధ్యాయం... యోగి ఆయుర్వేద రోడ్లు..?

praveen
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో యోగి ఆదిత్యనాథ్ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు ఎప్పటి కప్పుడు ఆశ్చర్యకరం గా ఆదర్శం గా ఉంటున్న విషయం తెలిసిందే. ఎవరు ఊహకందనిది చేయలేనివి  కూడా ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో చేసి చూపిస్తున్నారు. నేర చరిత్ర కు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో నేరస్తుల పై ఉక్కుపాదం మోపి ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు చేస్తూ.. అందరి వెన్ను లో వణుకు పుట్టించటం.. అంతేకాకుండా ప్రతిపక్షాల పై విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ఉండడం.. అది ఒక యోగి ఆదిత్యనాథ్ మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి.

 స్వయంగా ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్లి వినతి పత్రాలు స్వీకరించడం... ఇక రాష్ట్ర అభివృద్ధి పరంగా జపాన్ సంస్థల ను ఆకర్షించటం.. అంతే కాకుండా రాష్ట్రం లో ఉన్న అక్రమాల ను అరికట్టడం లో యోగి ఆదిత్యనాథ్  సర్కార్ కి సాటి లేరు అని చెప్పాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మరోసారి  గొప్ప పని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆయుర్వేదిక రోడ్లను ప్రారంభించేందుకు యోగి ఆదిత్యనాథ్ ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా  రాష్ట్రంలో 175 రహదారులు ఆయుర్వేదిక్ రహదారిలుగా మార్చింది యోగి  సర్కార్.

 ఆయుర్వేదిక్ రహదారులు అంటే... దాదాపు 175 రహదారులను  ఆయుర్వేదిక్  రోడ్ల  కింద తయారుచేసిన యోగి  సర్కార్... ఇక ఆ రహదారిల పక్కన ఏకంగా 35 వేల ఆయుర్వేదిక్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 30 రకాల  ఆయుర్వేదానికి  సంబంధించినటువంటి మొక్కలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్నో రకాల మేలు చేకూర్చే ఆయుర్వేదిక మొక్కలు ఉన్నాయి. ఇక రహదారులపై వెళుతున్న సమయంలో ఈ ఆయుర్వేదిక మొక్కల ద్వారా స్వచ్ఛమైన గాలి తో... ఎంతోమందికి రోగనిరోధక శక్తి పెరిగి అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సీఎం యోగి ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: