జగన్ కొత్త ప్లాన్... నియోజకవర్గానికి 5,000 మంది అరెస్ట్.. ఇది మరో సంచలనం..?
ఇక రోజు రోజుకు హైకోర్టు తీర్పుతో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం న్యాయస్థానం తీర్పుపై సీరియస్ గానే ముందుకు సాగుతోంది. దీంతో ప్రస్తుతం ఏపీ హైకోర్టు వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో పరిస్థితి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు స్టే విధించడం.. ఇటీవలే సిఐడి దర్యాప్తు కూడా కోర్టు అడ్డుకోవడం లాంటివి మరింత వివాదాస్పదంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుంది అంటూ వైసీపీ ఎంపీలు పార్లమెంటు సాక్షిగా కూడా గళమెత్తిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవల నేరుగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయడం మరింత సంచలనం గా మారిపోయింది. ఆ లేఖలో ఏముంది అనే దానిపై ఇప్పటికే ఆసక్తికర చర్చ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఇక జగన్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్లబోతుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ ఇప్పటికీ పార్టీ నుంచి ఆదేశాలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పడి జైల్ బరో కార్యక్రమం తరహాలోనే ప్రతి నియోజకవర్గానికి 5,000 మంది అరెస్టులు కావడానికి సిద్ధంకండి అంటూ పార్టీ నుంచి శ్రేణులకు సంకేతాలు వెళ్లినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇలా ఒకవేళ ప్రభుత్వం పై న్యాయస్థానాలు చర్యలకు ఉపక్రమిస్తే ఉద్యమానికి సిద్ధం అనే విధంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.