లోన్ మారటోరియం వినియోగించుకున్న వారికి బంపర్ ఆఫరే...!
అలానే ఈ లోన్ మారటోరియంను ఎవరు వినియోగించుకోవచ్చు అనే విషయానికి వస్తే...... చిన్న- మధ్య తరహా కంపెనీలు, విద్య , హౌసింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, ఆటో లోన్స్ , పర్సనల్ లోన్స్ లాంటి రుణాలు తీసుకున్న వారిని వినియోగించుకోమంది. ఇది ఇలా ఉండగా లోన్ మారటోరియం తీసుకోకుండా నెల నెలా రుణాల ఈఎంఐలు చెల్లించిన వారికి రివార్డు ఇవ్వాలని కేంద్రం భావిస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం లో తెలిపింది. అలానే రూ. 2 కోట్ల లోపు రుణం తీసుకున్న వ్యక్తులు , చిన్న - మధ్య తరహా కంపెనీలకు క్యాష్ బ్యాక్ ఇచ్చేందుకు కేంద్రం చూస్తున్నట్టు తెలిపింది.
'లోన్ మారటోరియంను మెజారిటీ మంది వినియోగించుకున్నారు. లోన్ మారటోరియంను వినియోగించుకోని వారికి లబ్ధి చేకూర్చడానికి కేంద్రానికి పెద్దగా ఖర్చు కాదన్నారు . కేవలం రూ.5000 కోట్ల నుంచి రూ.7000 కోట్లు ఖర్చు అవొచ్చు అని ICRA వైస్ ప్రెసిడెంట అనిల్ గుప్తా చెప్పడం జరిగింది. ఆర్బీఐ లోన్ మారటోరియం ఆరు నెలల పాటు ఇచ్చింది. కొందరు ఆరు నెలల పాటు మారటోరియంను వినియోగించుకోగా..... మరి కొందరు కేవలం 2 నెలలు మాత్రమే వినియోగించుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చెల్లించారు కనుక అలాంటి వారికి ఎలా బెనిఫిట్ ఇస్తారనేది కూడా కేంద్రం పరిశీలించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అన్నారు.