మీరు శాకాహారా...? అయితే ఈ సమస్యలు మీకు రావు...!

Suma Kallamadi
మనం పండించే కూరగాయల్లో ఎక్కువ ప్రోటీన్ లు, విటమిన్లు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మనం పండించే ఏ కూరగాయల్ని అయినా సరే  తీసుకోవచ్చు. బయట ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణం ప్రక్రియ సరిగ్గా ఉండదు. దాని వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలానే ఈ వెజిటేరియన్ వల్ల జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. మాంసాహారం లో ఎక్కువ కొలెస్ట్రాల్ వగైరా ఉంటాయి. శాకాహారంలో కూడా కొంత వరకు కొలెస్ట్రాల్ ఉన్నా దాని వల్ల ఎక్కువ సమస్యలు రావు .
వైద్య నిపుణులు అందుకే ఎక్కువ శాకాహారం తీసుకోమని అంటున్నారు. కూరగాయలు, పండ్ల లో ఎక్కువ పోషక విలువలు ఉండటం వల్ల జీవిత కాలంను పెంచే మార్గాలు కూడా వీటిలో ఎక్కువగా వుంటాయి అని అన్నారు. అలానే కూరగాయలు అధిక శాతం ఫైబర్ లను కూడా  కలిగి ఉంటాయి. దీని మూలం గానే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఇవి తోడ్పడ్డాయి.
నేటి కాలం లో చాలా మంది డయాబెటిస్ తో సతమతం అవుతున్నారు. ఇలా బాధ పడేవారు శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ శాతం అదుపులో ఉంటుంది. అంతే కాకుండా మన శరీర చర్మం సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా పండ్లను,కూరగాయలను తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు తెలిపారు. మనం తీసుకునే ఆహార పదార్థాలను ఎక్కువ జంక్ ఫుడ్ ను కాకుండా వెజిటేరియన్  ఫుడ్ ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కావు. చూసారా వెజిటేరియన్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు . దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక సమస్యల నుండి ఎంతో సులువుగా మనం బయట పడే వీలు కూడా ఉంది. కనుక శాకాహారం తీసుకుని ఫిట్ గా ఆరోగ్యంగా ఉండండి . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: