ఐపీఎల్ : నిన్న ఢిల్లీ గెలిచింది.. కానీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది..?

praveen
ఐపీఎల్ 2020 సీజన్  ప్రారంభమైంది ప్రతి మ్యాచ్  కూడా హోరాహోరీగా సాగుతు క్రికెట్ అభిమానులు అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. ఎంతోమంది అనుభవంగల ఆటగాళ్లు రాణించడమే కాదు తమ  ప్రతిభను చాటడానికి కొత్త ఆటగాళ్లు  సైతం తెరపైకి వచ్చి సూపర్ స్టార్ గా మారిపోతున్నారు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచీ తమ  ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది యువ  ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ప్రత్యర్థి జట్టు ఏదైనా తమదైన వ్యూహాలతో చిత్తుగా ఓడిస్తుంది... ఎప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది.


 ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో  దాదాపుగా అందరూ యువ ఆటగాళ్లు ఉండటం గమనార్హం.. తమ ప్రతిభను చాటుకునేందుకు అందరూ విజృంభించి మరి ఆడుతున్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించిన ఢిల్లీ జట్టు  మరోసారి పాయింట్ల పట్టికలో  టాప్ ప్లేస్ లోకి చేరుకుంది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్.. కలకత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ముందు బ్యాటింగ్  చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు..  ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ను ఉంచింది . ఇక ఆ తర్వాత బౌలింగ్ లో కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను చిత్తు చేస్తూ ఎంతో సునాయాసంగా విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.


 ఇలా వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కు ఎదురు దెబ్బ తగిలింది.  ప్రస్తుతం ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఓపెనర్ గా ఉన్న యువ ఆటగాడు పృద్వి షా తర్వాత మ్యాచ్ లో  ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  నిన్న జరిగిన మ్యాచ్ లో గాయం కారణంగా పృద్వి శం  వచ్చే మ్యాచ్ లో  జట్టుకు దూరం కానున్నాడు.  నిన్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొమ్మిదో ఓవర్లో రస్సెల్  వేసిన బంతి పృథ్వీషా కాలి మడమకు తగిలి గాయం అయింది. అయినప్పటికీ నొప్పి తోనే బ్యాటింగ్ కొనసాగించిన పృద్వి షా  చివరికి విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: