కామన్వెల్త్ గేమ్స్ లో.. ఆ క్రీడ కి గుడ్ బాయ్.. భారత్ కి షాక్..?

praveen
భారత్ కి బాగా పట్టున్న క్రీడలో షూటింగ్  ఒకటి అన్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ క్రీడలు షూటింగ్ విభాగంలో ఎంతో మంది భారత క్రీడాకారులు ప్రతిభను చాటి ఎన్నో మెడల్స్  సంపాదించుకుంటూ ఉంటారు. అయితే కామన్వెల్త్ క్రీడల విషయంలో ఎప్పటికప్పుడు నిర్వాహకులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల్లో ఎన్నో క్రీడలు కొనసాగుతూ ఉంటాయి. ఇక కొన్ని కొన్ని కొత్త క్రీడలను  కామన్వెల్త్ క్రీడల్లో చేరుస్తూ ఉంటే మరికొన్ని క్రీడలను కామన్వెల్త్ క్రీడల లిస్టులో నుంచి తొలగిస్తూ ఉంటారూ.

 ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న కామన్వెల్త్ క్రీడల నిర్వాహకులు... కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ ను  పక్కకు పెట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వెంటనే కలుగజేసుకుని భారత్ చర్చలు జరిపింది. ఎందుకంటే భారత్ కు బాగా పట్టున్న క్రీడల్లో షూటింగ్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో ఎప్పుడు భారత అథ్లెట్లు ప్రతిభను చాటి మెడల్స్ సంపాదిస్తూ ఉంటారు. అందుకే ఎలాగోలా భారత్ చర్చలు జరిపి కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ ఉండేలా భారత్  ఒప్పించింది కూడా.

 కానీ చివరికి కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ తీసి వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 2022 కామన్వెల్త్ క్రీడల కోసం షూటింగ్ ను తీసి వేయకుండా భారత ఒప్పించినప్పటికీ 2026 కామన్వెల్త్ గేమ్స్ లో  మాత్రం షూటింగ్ ని తీసి వేయడం ఖాయం అన్న  విధంగానే ఉంది పరిస్థితి. ఇటీవలే హోమిల్టన్ ... బిడ్  కమిటీ ప్రతిపాదించిన రోస్టర్ లో షూటింగ్ లేకపోవడం గమనార్హం. దీంతో 2026 లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ లో  షూటింగ్ ఉండే అవకాశం లేదు అన్నది ఖాయంగా మారిపోయింది. కాగా భారత్ కు బాగా పట్టున్న షూటింగ్ ను కామన్వెల్త్ క్రీడల నుంచి నిషేధించడం తో ఈ నిర్ణయం  భారత్ కి భారీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: