అగ్గిపుల్ల తలపై సోనుసూద్ బొమ్మ.. వారెవ్వా.. ఏం ప్రతిభ గురూ..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ కష్టకాలంలో సోనూసూద్ ఎంతోమందికి ఆపద్బాంధవుడిగా మారిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు వలస కార్మికులకు... ఇప్పుడు ప్రజలకు ఆపదలో ఆదుకునే దైవంగా మారిపోయాడు. సహాయం కావాలని కోరితే చాలు వెనకడుగు వేయకుండా... సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాడు సోనూ. దీంతో ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా సోను సూద్ ఎంతో మందికి ఆదర్శం గా మారిపోయాడు. సోను సూద్ కి అభిమానులు కూడా ఎక్కువ అయిపోయారు. అయితే మామూలుగా తాము  అభిమానించే వ్యక్తి పై తమకున్న అభిమానాన్ని కొంతమంది సరికొత్తగా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే చేశాడు ఒక యువకుడు.


 మామూలుగా అయితే ఒక పెన్సిల్ చేత పట్టుకొని.. పేపర్ పై లేదా చార్ట్ పై బొమ్మలు గీయడం ఒక కళ. ఇది కాస్త సులువే అని చెప్పాలి. కానీ చిన్న చిన్న వస్తువుల పై బొమ్మలు గీయడం అంటే అది గొప్ప ఆర్ట్  అనడంలో అతిశయోక్తి లేదు. వికారాబాద్కు చెందిన ఓ యువకుడు మాత్రం ఎంతో కష్టపడి పెన్సిల్ ముక్కుపైన ఒక బొమ్మను రూపొందించాడు. సరిగ్గా ఎలా అంటే ఈగ సినిమాలో సమంత ఒక చిన్న బొమ్మను రూపొందించినట్లు గానే. ఇక ఇలా కేవలం పెన్సిల్ ముక్కు తోనే రకరకాల డిజైన్లు వేసి  తన ప్రతిభను చాటుకున్న వికారాబాద్కు చెందిన యువకుడు ఇక ఇప్పుడు ఏకంగా సోనూసూద్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.


 ఏకంగా అగ్గిపుల్ల పై సోనుసూద్ బొమ్మ చిత్రీకరించి  సోను సూద్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుని  అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఆ యువకుడు. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ మైక్రో ఆర్టిస్ట్ పేరు మధుసూదన్. అయితే అగ్గిపుల్లపై  సోను సూద్ ముఖాన్ని చెక్కి .. తాను రూపొందించిన ఈ కళాకృతులు సోషల్  మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయాయి. ఈ పోస్టులు చూసిన సోనుసూద్... తనను  ఒకసారి కలవాలి అంటూ మధుసూదన్ ను  కోరాడు. ఇక  ఇటీవలే సోనూసూద్ ను మధుసూదన్ కలిసి తన కళాకృతులను బహుమతిగా ఇచ్చి... ఎంతగానో ఆనందం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: