పార్టీ పదవుల విషయంలో తమ్ముళ్ల హ్యాపీ ? బాబు స్ట్రాటజీ ఏంటి ?

టిడిపి అధినేత చంద్రబాబు కొత్తగా ప్రకటించిన పార్టీ కమిటీల విషయంలో తెలుగు తమ్ముళ్లు అంతా ఖుషీగా ఉన్నారు. పార్టీ కోసం కష్టించి పని చేసిన వారికి, జగన్ గాలిని ఎదుర్కొని గెలిచిన వారికి, ఇలా అందరికీ చంద్రబాబు న్యాయం చేశారనే అభిప్రాయాలు ఇప్పుడు పార్టీ నాయకులు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని నడిపించేందుకు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. భవిష్యత్తు పై బెంగ ఆ పార్టీ నాయకులను ఆవరించింది. ఎన్ని చేసిన తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం రాదని అంతా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.  


చంద్రబాబు సైతం పదేపదే పార్టీ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పిలుపు ఇస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ దశలో పార్టీని పరుగులు పెట్టించేందుకే, తిరిగి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు చంద్రబాబు ఇప్పుడు కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం తీసుకువచ్చారు. గత టిడిపి ప్రభుత్వం లోని విధానాల కారణంగా టీడీపీకి దూరమైన సామాజిక వర్గాల ప్రజలను దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు ప్రస్తుత కమిటీల్లో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు ఈ కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే యువ నాయకులకు ఎక్కువగా పెద్దపీట వేశారు. 


పార్టీ కోసం కృషి చేసిన వారికీ ప్రాధాన్యం ఎక్కువగానే ఇచ్చారు.  గత టీడీపీ ప్రభుత్వం లో చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా, ఆ తప్పును సరి దిద్దుకున్నట్లుగా బాబు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కమిటీల నియామకాల విషయంలో టిడిపి నాయకులు ఎవరిలోనూ పెద్దగా అసంతృప్తి లేదు. అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను కవర్ చేసి, పార్టీకి మొదటి నుంచి అండదండలు అందిస్తున్న వారికి మంచి ప్రాధాన్యం పెంచారు. ఇదే పని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చేసి ఉంటే, ఇప్పుడు ఈ తిప్పలు వచ్చేవి కాదనేది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం. ఇక కొత్త కమిటీల నియామకం పూర్తయిన తరుణంలో ప్రజా పోరాటాలపై దృష్టి సారించి, వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, ప్రజల్లో చర్చ జరిగే విధంగా చేసే పనికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: