నిజామాబాద్ రాజకీయాల్లో కలకలం రేపెందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ నుంచి కవిత ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అసలు కరోనా వైరస్ ప్రభావం రాకపోయి ఉంటే, ఎప్పుడో ఈ ఎన్నికలు ముగిసేవి. కానీ తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఇప్పుడు ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది ఇప్పటి వరకు ఫోకస్ అంతా దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల పైనే పెట్టిన టిఆర్ఎస్ ఇప్పుడు పూర్తిగా నిజామాబాద్ వైపు దృష్టి మళ్ళించడం తో రేవంత్ సైతం ఇప్పుడు నిజామాబాద్ వైపు దృష్టి సారించినట్లు కనిపిస్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైతే, కెసిఆర్ ఆమెను మంత్రివర్గంలోకి తీసుకు ని పార్టీలోను ప్రభుత్వంలోను యాక్టివ్ చేస్తారని, అప్పుడు టీఆర్ఎస్ బలం మరింతగా పెరుగుతుందని నమ్ముతున్నారు.
అందుకే కవితను ఈ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా రేవంత్ రంగంలోకి దిగ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలోని టిఆర్ఎస్ అసంతృప్తులను గుర్తించే పనిలో ఇపటికే రేవంత్ దిగినట్లు తెలుస్తోంది. వారితో ఫోన్ లో సంప్రదిస్తూ టిఆర్ఎస్ పార్టీ ని దెబ్బతీసే విధంగా రేవంత్ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే కవిత ఎంపిక ఇక్కడ లాంఛనప్రామే. ఎందుకంటే టిఆర్ఎస్ కు ఇక్కడ మెజారిటీ స్థానాలు ఉన్నాయి. నిజామాబాదు లో మొత్తం 824 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉండగా, వారిలో 570 మంది టిఆర్ఎస్ వారు, మిగతావి వివిధ పార్టీలకు చెందినవారు ఈ లెక్కన చూసుకుంటే కవిత విజయం ఇక్కడ దాదాపు ఖాయం . అయితే వీరందరిలోనూ చాలామంది టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నారని, ఓటింగు లో కవిత కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని రేవంత్ నమ్ముతున్నారు.
ఈ ఈ మేరకుు ఎవరెవరు అసంతృప్తితో ఉన్నాారో గుర్తించి, బుజ్జగించి, తమ దారిలోకి తెచ్చుకుని, కవితను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అవసరమైతే ఈ విషయంలో ఇతర పార్టీల సహకారం కూడా తీసుకోవాలనేది రేవంత్ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రేవంత్ కనుక కలగ జేసుకుంటే, ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు లేకపోలేదని, ఏదో ఒకరకంగా ఇక్కడి రాజకీయాలను రేవంత్ మార్చగలరని టిఆర్ఎస్ అగ్ర నేతలు ఆందోళన చెందుతున్నారు.